ఆదర్శాల పూ బాట

ఆదర్శాల పూ బాట

అమ్మ ప్రేమ కొండంత
అమ్మ ప్రేమ అనంతం
అమ్మంటే మరో బ్రహ్మ
అమ్మంటే నడిచే దేవత
అమ్మ నీడ చల్లదనం
అమ్మ మనసు హిమనగం
అమ్మ రక్తాన్ని మార్చి కడుపు నింపుతుంది
అమ్మ కర్మ యోగి గా మారుతుంది
అమ్మ ప్రేమ ప్రవహించే జలపాతం
అమ్మ ప్రేమ తీయ తేనెల సోన
అమ్మ జోలపాటలో అద్వైతాన్ని చెప్పిన గురువు
అమ్మ నడతను నడకను
నేర్పిన గురువు
అమ్మ మాట పంచదార చిలుక
అమ్మ బాట ఆదర్శాల పూ బాట
అమ్మంటే కాదురా బొమ్మ
అమ్మంటే దైవ ప్రతినిధి
అమ్మ దైవ సన్నిధి చేరేవరకు వదలకు
నీకు నడక నేర్పిన అమ్మకు వృద్ధాప్యంలో
ఊతకర్రగా మారు.
వృద్ధాశ్రమాల పాలు చేయకు
దైవం కూడా క్షమించదు నిన్ను

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *