ఆదర్శం

ఆదర్శం

అక్షరాలన్నీ మాలలుగా జేసీ
ఆప్యాయతలన్ని మూట గట్టి
అందమైన వాక్యాలుగా మార్చి
ప్రేమలన్ని భావలై విరాజిల్లగా
వేదనంతా ఆవేదనగా మార్చినా
మనసులోని భావాలని కత్తులుగా జేసినా
అక్షర మనే ఆయుధం తో
గుండెల్లో గుచ్చెలా ప్రశ్నిoచినా
అదొక కలానికే సాధ్యం, మనతరం
కాలగర్భంలో కలిసిపోయినా
రాసినా రాతలన్ని ముందు
తరానికి కావాలి ఆదర్శం…

ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు…

– అర్చన

Related Posts