ఆడవాళ్ళు మీకు జోహార్లు

ఆడవాళ్ళు మీకు జోహార్లు

ఆడవాళ్లు ఆదిశక్తి స్వరూపాలు
అమ్మానాన్నల
అనురాగ దేవతలు
మమతలు పంచే మహాలక్ష్మిలు
సౌందర్యాల భరిణలు
బరువు బాధ్యతల మోస్తున్న భామలు
ఆలనా పాలన చూసే
అతివలు
పాఠాల గుణపాఠాల భారముమోసే
భూమాతలు
ధైర్యాన్ని నూరి పోసే నారీమణులు
వలచిన ప్రియునికి ఇష్టసఖి
అత్తింటి పుట్టింటి గౌరవాల రెండు కళ్ళ కంజాక్షి
అనురాగం నిండిన
స్త్రీ మూర్తులు
అమ్మలగన్న అమృతవల్లులు
బాధలనుభరించే
శక్తి శాలులు
ఒత్తిళ్ళ ఒడిలో ఊగినా
చిరునవ్వులు మరుగైనా
రాజీ పడని కుటుంబ సామ్రాజ్యానికి రాణులై
మౌన పోరాటాల మగువలై
ఆశలే హరివిల్లుగా
మలచుకుంటూ
సాగిపోయే సాహసవంతులు
ఆడవాళ్లు మీకు జోహార్లు
అడుగు ముందుకే ఎల్లప్పుడు…….

– జి జయ

Related Posts