ఆడవాళ్ళు మీకు జోహార్లు

ఆడవాళ్ళు మీకు జోహార్లు

ఆడవాళ్ళు మీకు జోహార్లు

పుట్టింట్లో మొదలైన ఆడదాని జీవితం..
బిడ్డగా, చెల్లిగా, అక్కగా, ఆలిగా, తల్లిగా..
అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ..
అన్నింటా అడుగడుగునా అవమానాలు మోస్తూ..
అర్ధంతరంగా చదువు ముగించి పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ స్త్రీ గాథ..

తను చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు అనుభవించింది.. తనకు చదువు లేదు.. ఇంట్లో పరిస్థితి బాలేక చదువుకోలేకపోయింది. అన్న, తమ్ములకి అండగా.. తల్లి తండ్రులకు భరోసాగా నిలిచింది.. ఏమి తెలియని అమాయకురాలు.. బయటి ప్రపంచం తెలియని ఓ పిచ్చి మాలోకం.. ఇల్లే ప్రపంచం. తన వాళ్ళే ముఖ్యం.. అని తన గురించి కూడా ఏమీ కోరుకోని ఓ మంచి వ్యక్తి.. తనకి పెళ్లి చేసి పంపాలని. ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు…

రానే వచ్చింది సంబంధం.. కుదిరింది. చేశారు.. అప్పగింతలు అప్పుడు తలితండ్రులు ఆమెతో ఇలా అన్నారు.. అమ్మా ఇన్ని రోజులు మా ఇంటి మహాలక్ష్మిలా తిరిగావు.. ఇక నుండి అత్తరిల్లే నీ ఇల్లు.. వాళ్ళే నీ తల్లితండ్రులు.. మరుదులు, ఆడపడుచులు నీకు తోబుట్టువులు… తప్పు చేయబోకు.. అన్నిటికీ సర్దుకు పో భర్త మాట తప్పబోకు.. అత్తమామలకు అడ్డు చెప్పకు.. ఆడపడుచులను అలగనివ్వకు.. ఇలా అందరితో కలిసి నువ్వే కాస్త అన్నిటికీ సర్దుకుని మన ఇంటి గౌరవాన్ని పెంచాలి అని ఇలా చాలా చెప్తారు…

ఆ రోజు నుండి ఆత్తింటిని దేవాలయంలా పుట్టింటి కంటే ఎక్కువగా అందరినీ తన కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది.. భర్త ఎం చేస్తున్నాడు.. చేసేది తప్పా ఒప్పా అని అడగదు.. అత్తమామలు ఎన్ని అన్నా అన్నది నావాల్లే కదా అని సర్దుకు పోయేది. ఇలా అన్నిట్లో తనకు అవమానాలు కలుగుతున్నా ఎదురు నిలవలేదు.. తన పుట్టింటి పరువు పోకూడదు అని అన్నిటినీ సహించేది.. అలా తనకి ఒక పాప పుట్టింది. అలా కొద్ది రోజులు గడిచాయి..

ఆత్తింటి ఆరళ్ళు ఎక్కువయ్యాయి.. భర్త రోజు రోజుకి చేయి దాటి పోతున్నాడు.. తనకి ఎం చేయాలో తోచడం లేదు.. కృంగి పోతుంది.. తన గోడు వినే వారు లేరు.. అత్తమామలు వాళ్ళకి సంబంధమే లేదు అన్నట్లు గా ఉంటారు. భర్త తన మాట అసలు లెక్క చేయడు. పుట్టింట్లో చెప్పి తల్లి తండ్రులకు బాధని కలిగించాలని లేదు అందుకే తనలో తానే ఏడుస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా.. తనకి ఒక ఆలోచన వచ్చింది.. వీళ్ళకి నా బాధ అర్థం కావాలి.. ఎలా ఎం చేయాలి అని ఆలోచించి..

ఇంట్లో నుండి బయటికి వచ్చింది.. ఇంట్లో తన కోసం చూశారు కనిపించలేదు ఎక్కడా….. అక్కడే ఒక టేబుల్ దగ్గర ఒక లేఖ కనిపించింది.. భర్తకి.. అందరూ నన్ను క్షమించాలి.. నేను చేసేది తప్పో ఒప్పో నాకు తెలీదు.. కానీ నేను మీ వేదింపులు బరించలేక పోతున్నా.. నా బాధని ఎవరు పట్టించుకోవటం లేదు.. అన్నింటా అండగా ఉండి నాకు తోడు నీడగా ఉంటారు… నన్ను ప్రేమగా చూసుకుంటారు.. నాకు భరోసా ఇస్తారు అనుకుని నీ వెలు పట్టుకుని వచ్చాను నీ వెంట.. ప్రేమ అనేది పక్కన పెడితే కనీసం మనిషిలా కూడా చూడడం లేదు..

ఇలా అని బయట చెప్పి మన కుటుంబ గౌరవాన్ని తగ్గించలేను.. మా పుట్టింటి వాళ్ళకు చెప్పి మిమ్మల్ని తలడుంచుకునేల చేయలేను. అందుకే నేను భారం అయిన వాళ్ళకి భారంగా ఉండలేను.. సంసారం అనే మహాసముద్రన్ని కన్నీటి సంద్రంలో ఈదలేను.. అందుకే ఆ సముద్రంలో కలిసిపోవాలని వెళ్తున్నా ఇక సెలవు అని రాసి ఉంటుంది.. ఆ ఉత్తరం గురించి తెలుసుకున్న తండ్రి గుండె ముక్కలవుతుంది..

శోక సంద్రంలో మునిగిపోయారు.. అయినా ఎం లాభం తను ముందు వెనక చూసుకోకుండా తొందర పడి చేసిన పెళ్లి అనే ఒక పెద్ద బాధ్యత తన కూతురి భవిష్యత్తు ని ఇలా అంధకారంలోకి తోస్తుంది అని తెలుసుకోలేక పోయారు.. అంతా ముగుసి పోయింది.. అర్ధాంతరంగా తన బిడ్డ అర్దాయుషుతో కాను మూసింది.. వేదింపులు తట్టుకోలేక.. ఇన్ని మౌనంగా చనిపోయే వరకు భరించిన ఓ స్త్రీ మూర్తి నీకు జోహార్లు.. అటు అత్తింటికి ఇటు పుట్టింటికి మర్యాద పోకూడదు అని నీ ప్రాణాలను అర్పించి ఊపిరిని వదిలిన ఓ పుణ్యమూర్తి నీకు వందనాలు..

కానీ తను అలా చేయకుండా.. తనని గౌరవంగా అయినా తన వాళ్ళతో మాట్లాడించి మార్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు.. కానీ అలా చేస్తే తనకి ఇంకా ఇంకా నరకం చుసేదేమో.. ఎందుకంటే మగాడికి నీది తప్పు అని వేలెత్తి అని చూపిస్తే అహం.. కానీ వాడి అహంకారమే ఇపుడు వాడిని వాడి కూతురిని ఒంటరి చేసింది..

భార్య అంటే మీరు ఆడుకునే వస్తువు మాత్రమే కాదు.. మిమ్మల్ని పసిపిల్లలా చూసుకునే అమ్మ కూడా.. ఒకసారి భార్యను ప్రేమించి చూడండి… తన ప్రేమ తిరిగి పొందాలంటే మీకు ఈ జన్మ సరిపోదు… అంతటి ప్రేమను పంచగలదు..

– వనీత రెడ్డీ

ఆడవాళ్ళు మీకు జోహార్లు Previous post ఆడవాళ్ళు మీకు జోహార్లు
నేను Next post నేను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *