ఆకలి

ఆకలి

ఆకలి రుచి ఎరుగదు
నిద్ర సుఖం ఎరుగదు
అంటారు పెద్దలు
ఆకలి తీర్చేది అన్నం
అది పెట్టే వాడు రైతు
ఇప్పటి రోజుల్లో అన్నం పెట్టే
రైతే ఆకలి అంటున్నాడు
ఆకలి భాద తెలిసిన వాడు
జీవితంలో పాఠాలు
నేర్చుకుంటాడు
ఆకలికి మందు లేదు ఇప్పటికీ అది వుంటే
జగమంతా శూన్యం
ఆఆకలి తీరని ఆ క్షణం
రగులుతోంది మనసు
బాధతో
ఆకలి చావులు లేని దేశమే
సుసంపన్నం
అప్పుడే ప్రారంభం అవుతుంది నవ శకం
మన అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాతకు
వందనం పాదాభివందనం.
– జి.జయ

Related Posts