ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2

ఆకు+ముళ్ళు= అద్వైత పార్ట్ 2

వాళ్లిద్దరూ జగన్ గదికి వెళ్ళారు. ఏదో కావాలనే కోరికతో కాలిపొతున్న అద్వైత అతని వెంట బలికాబోతున్న మేకలా వెళ్ళింది. జగన్ తన గదిలో ఎవరితోనో చెప్పి ఏర్పాట్లు చేయించాడు. అవేవీ తెలియని అద్వైత అతనితో జరగబోయే సంగమం గురించి ఆలోచనలతో వెళ్ళింది.

ఇద్దరూ గది దగ్గరకు వెళ్ళగానే జగన్ తనకు అనుమానం రాకుండా తాళం తీశాడు. అంతకు ముందే జగన్ దగ్గర పనిచేసే కుర్రాడు చెప్పుల కింద పెట్టిన తాళం చెవిని తీసుకుంటూ చుట్టూ ప్రక్కల ఎవరు లేని ఆ ఏకాంత ప్రదేశంలో ఉన్న తన గదిలోకి అద్వైతము ఆహ్వానించాడు.

చుట్టూ ఎవరున్నారో, అసలు ఆ గది ఎక్కడ ఉందో, తనకేం జరుగుతుంది కూడా గమనించే స్థితిలో లేదు అద్వైత. ఏదో కావాలని మాత్రం చాలా బలంగా అనిపించసాగింది. వయసు వేడి ఏమీ ఆలోచించకుండా ఏమీ పట్టించుకోకుండా చేసింది.

చిన్న గదిలో ఒక సింగిల్ బెడ్ దాని పై ఒక బెడ్ షీట్ వేసి ఉంది. పక్కనే వాటర్ బాటిల్ లు, పొద్దున తిన్న టిఫిన్ పొట్లాలు, రెండు నల్లగా ఉన్న గిన్నెలు, మాడి పోయిన పొయ్యి, గోడలకు తగిలించి ఉన్న బట్టలతో అశుభ్రంగా ఉన్న ఆ గది అద్వైతకు అందంగా కనిపించింది.

అదొక ఇంద్రభవణంలా తానొక రాకుమార్తెలా, జగన్ ఒక రాజ కుమారుడి లాగా కనిపించసాగింది. కోరికతో కళ్ళు మసక కమ్మగా, వయసు పొంగులు విరహాన్ని తట్టుకోలేక పోతున్నా అంటూ జగన్ ఆమెని ఆక్రమించుకున్నాడు.

ఏదేదో కావాలని కోరుకున్న అద్వైత అతనికి లొంగి పోయింది. ఉరకలు వేస్తున్న వయసు కోరికల తాపాన్ని చల్లార్చుకునేందుకు తలపడ్డారు. ఇద్దరూ పోటీలు పడి మరీ పాల్గొన్నారు ఆ యుద్ధం లో…

గంట పాటు సాగిన సృష్టి కార్యంలో ఆఖరికి ఇద్దరూ గెలిచారు. గెలిచాను అనుకున్నారు కానీ అద్వైత మాత్రం తొందరపడి ఓడి పోయింది.

ఓడి పోయాను అని తెలియక ఏదో సాధించాను అన్నట్టుగా జగన్ తల పై ముద్దు పెట్టుకుంటోంది. జగన్ మన పెళ్లి ఎప్పుడు అంటూ అడిగింది. దానికి జగన్ పెళ్ళా పెళ్లెంటి అంటూ అడిగాడు. ఆశ్చర్యపోతూ అదేంటి పెళ్లి చేసుకోవా, మన ఇద్దరి పెళ్లి అంది అద్వైత.

హా హా అంటూ నవ్వుతూ ఇంకా ఏ కాలం లో ఉన్నావు అద్వైత మనం ఏదో సరదాకు కలిశాం. ఇప్పుడే పెళ్లి ఏంటి? కావాలనుకున్నాము కలిసాము. సరదాగ ఎంజాయ్ చేయాలి అంతే కానీ పెళ్ళీ, గిల్లీ అంటే కుదరదు. మా వాళ్ళు నా పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

నా మరదలు రెడీగా ఉంది నా కోసం చూస్తూ లక్షల కట్నం తో… నిన్ను చేసుకుంటే కట్నం రాదు. పైగా ఇంట్లో వాళ్ళు తంతారు. కానీ ఇలాగే కొన్ని రోజులు ఎంజాయ్ చేసి మీ నాన్న తెచ్చిన వాడిని నువ్వు చేసుకో నేను నా మరదలును చేసుకుంటా అన్నాడు తేలిగ్గా జగన్.

అతని మాటలు వింటున్న అద్వైత మరి మన ప్రేమ ఇద్దరం ప్రేమించుకున్నాం కదా దాని మాట ఏమిటి అంది అమాయకంగా… నీ బొంద ప్రేమ, ఏదో వయసులో ఉన్నాం మనకు ప్రేమ కథ ఉందని చెప్పుకోవడానికి బాగుంటుందిలే….

కానీ, రియల్ గా బాగుండదు బేబీ నువ్వు నా మాట విను. జరిగిందేదో జరిగిపోయింది. ఇలాగే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం. తర్వాత నీ దారి నీది నా దారి నాది అన్నాడు జగన్.

అద్వైత బిత్తరపోయింది. లతకు జగన్ గురించి తమ ప్రేమ గురించి ఎంతో గొప్పగా చెప్పింది. కానీ, ఇప్పుడు జరిగింది వేరు. జగన్ మోసం చేశాడు అనిపించింది. అదే మాట అంది అంటే ఇదంతా కేవలం నా శరీరం కోసమేనా నీకు నా పై ప్రేమ లేదా అంది కోపంగా…

ప్రేమా తొక్కా…. ఈ వయసులో కలిగే ఆకర్షణ ఇది. అసలు నువ్వు పడతావు అనుకోలేదు కానీ నా అదృష్టం నువ్వు పడ్డావు. ఇద్దరం ఎంజాయ్ చేశాం అంతే…

నువ్వు కూడా కావాలనుకున్నావు కదా ఇందులో నా తప్పేం ఉంది. నీకు ఎంజాయ్ చేశావు. నేను ఎంజాయ్ చేశాను అయిపోయింది.

ఇక రాద్దాంతం చేయకు మూసుకుని చదువుకో ఇవన్నీ మర్చిపో లేదంటే ఇదిగో మన భాగోతం మొత్తం రికార్డ్ అయ్యింది. వెధవ వేషాలు వేస్తే నెట్ లో పెడతా సో నోరుమూసుకుని వెళ్ళు అన్నాడు జగన్ డోర్ వెనకాల ఉన్న సెల్ ఫోన్ తీస్తూ..

అది చూసిన అద్వైత నివ్వెర పోయింది. ఎంతో నమ్మిన జగన్ ఇలా చేస్తాడు అని అసలు ఊహించలేదు. ఎన్నో కలలు కన్నది. ఎన్నో ఉషించుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకుంది. అవ్వన్నీ కలలు అని తెలిసి బిత్తరపోయింది.

ఇప్పుడు అద్వైత ఏం చేస్తుంది? మీరేం అనుకుంటున్నారు? జగన్ వీడియో నెట్ లో పెడతాడా లేదా చదవండి తదుపరి భాగం లో….

– భవ్య చారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress