ఆమని మనదే సుమా!

ఆమని మనదే సుమా!

నిత్యం కనుల కుహరాన నెలవై ఉంటావు
అడుగడుగునా నాకై తపిస్తుంటావు
ఎంత వెదికినా అందాలకి కొదవ రానంటావు
ఇలకు దిగిన వెండి‌చందమామ నంటావు
నెచ్చెలీ! ఏనాటి పుణ్యమో నీ సఖుడనైతినిగా…

అనుక్షణం తపించే నా తపనను కానరావా
నీకై పరితపించే నీ సఖుని‌ బాధ మాన్పగ రావా
ఎడారి గుండెలోన కలలే ఫలించి
అలమటించే నా హృది వేదన తీర్చగ రావా
ప్రాణ సఖీ! నీ నాధుడ నేనంటిని‌విగా….

సఖా.! నే నీ నెచ్చెలినే వేచియుంటి
గత స్మృతుల తలపులే ప్రాణముగా
నిను చేరి సుఖించు క్షణాలు లెక్కిస్తూ
కోరివచ్చె కొమ్మ దరిచేరి ఏలుకోమ్మ
నీ ముంగిట చేరి మైమరచిపోయెద సఖా!

ఎడబాటులెరుగని కాలాలు మనవవగా
కలతలెరుగని అనుబంధమవగా
తరలి వచ్చిన నీ హృదయేశ్వరిని ఏలుకొని
సుఖమయ జీవనమున
తరియించెదము చెలికాడా
ఆరు ఋతువులేకమైన ఆమని మనదే సుమా

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts