ఆమె

ఆమె

ఆమెకి 18 యేళ్లు అప్పుడే తన ఇంటర్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది… అప్పటివరకు తన స్నేహితులతో సంతోషంగా ఉన్న ఆమె.. ఇంటికి రాగానే తన జీవితమే మారిపోయింది అన్నట్టు ఉండేది… ఎందుకంటే ఆమె నవ్వినా, చూసినా, ఏడ్చిన ఆఖరికి ఏ పని చేసినా ఆమె తల్లిదండ్రులు పరువు పోతుంది అని ఆమె సంతోషాలను దూరం చేసేవారు…. ఒకరోజు ఆమె తండ్రి ఆమె దగ్గరకు వచ్చి నీకు ఇంకో నెల రోజులలో పెళ్లి చేయబోతున్నాం అని చెప్పాడు…

అప్పుడు ఆమెకీ ఏం చేయాలో తోచక నేను చదువుకుంటా అని వాళ్ల నాన్న గారితో చెప్పింది…. దానికి ఆ పెద్దమనిషి ఆడపిల్ల అని కూడా చూడకుండా చెంప చెళ్లుమనిపించారు…. నా మాటకి కట్టుబడి ఉండటమే నీకు మంచిది అని చెప్పి వెళ్ళిపోయారు…. పెళ్లి రోజు రానే వచ్చింది…. పెళ్లి కొడుకు చూడటానికి ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు…. పెళ్లి ముస్తాబు అంత చూడగానే ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది… ఎవరో పాతాళం లోకి తీసేసిన భావన ఏర్పడింది…. ఎక్కడో చిన్న ఆశ ఆ పెళ్ళికొడుకు వచ్చి ఆమెతో మాట్లాడితే పెళ్లి ఆపించేయోచ్చు అని….. పెళ్లి అయిపోయింది…

ఆమె జీవితం ఇంకా పరాయి వాళ్ళది అనే ఊహ ఆమె ఏర్పడింది…. కొత్త మనుషులు, కొత్త బంధాలు, అన్ని కొత్తగానే అనిపించింది… కానీ దేవుడు ఎవరినీ ప్రశాంతం గా ఉండనివ్వడుగా… పెళ్లి అయిన మొదటి రోజే ఆమెకి ఆమె భర్త కొట్టడం మొదలు పెట్టాడు… ఆమె శోభనం రాత్రి ఒక మృగం లా ప్రవర్తించాడు…. ఆమె తన బాధని వాళ్ల అమ్మగారితో చెప్పుకుంటే…. ఆమె ఇవన్నీ అందరి జీవితాల్లో ఉంటాయి నువ్వే సర్దుకు పోవాలి అని చెప్పింది.

అలా 2 నెలలు గడిచాయి… ఒక రోజు ఆమెకి ఒక ఫోన్ వచ్చింది… మీ ఆయన రాంగ్ రూట్లో రావడం వల్ల ఏక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అని…. ఆమాటకి ఆమె చలనం లేకుండా కింద పడిపోయింది. అతని అంత్యక్రియలు నిర్వహించారు.. ఆమె మొహం లో అసలు జీవమే లేదు… తన అత్తింటి వారు ఆమెని బయటకి గెంటేశారు… మా వాడు నిన్ను చేసుకున్నప్పటి నుండి ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది అని నాన మాటలు అన్నారు….ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకి వచ్చేసింది..

“పరువు కీ ప్రాణం ఇచ్చే కుటుంబం అది కానీ కూతురి కన్నీటికి కారణం అయ్యారు”.

బయట వాళ్ల మాటలు పడలేక ఆమెకి మళ్ళీ పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు… ఎన్నో సంబంధాలు తరువాత ఆమెకి పెళ్ళి కుదిరింది…. పెళ్లి కాకముందు నుండి ఆమెని కంట్రోల్ చేయడం మొదలు పెట్టాడు… అక్కడకి వెళ్లకు, ఇక్కడకి వెళ్ళకు, అది చేయకు, ఇది చేయకు అని… అవన్నీ మౌనంగా భారిస్తూ వచ్చింది ఆమె…

అతనితో పెళ్లి అయిన తరువాత ఆమె జీవితం చాలా దీనంగా అయిపోయింది…. అతను తాగి వచ్చి ఆమెని కొడుతూ ఆమె చనిపోయిన భర్త గురించి ఆమెని బాధపెడుతూ ఉండేవాడు.. ఆ నలిగిన కాపురాల్లో… ఆమెకి ఒక పాప పుట్టింది… ఆ పాప తన పాప కాదు అని గొడవ చేసాడు అతను… ఆమాటకి ఆమె దుఖం ఇంకా ఆగను అన్నటు పొంగుకొచ్చింది… ఆమె గుండె రోదన ముందు ఈ ప్రపంచం కూడా చిన్నదే… ఆ మాటలు తట్టుకోలేక తన కన్నీటికి స్వేఛ్ఛనిచ్చి ఆమె ఈలోకనికి వీడ్కోలు పలికింది…

పరువు కోసం కన్న కూతురిని బలితీసుకున్న తల్లిదండ్రులు… 

కట్టుకున్నదానిని కూడా సరిగా చూసుకోవడం రాని, చేతకాని మొగుడు….

ఎన్నో కొత్త ఆశలతో అత్తింట్లో అడుగు పెడితే వాటిని అడియాశలు చేసిన అత్తింటి వాళ్ళు….

రెండో పెళ్లి అయినా అతనే తన సర్వస్వంగా భావిస్తే ఆమెనే తన అనుమానంతో బాధ పెట్టిన అతను….

ఆడపిల్ల అదృష్టవంతురాలో దురదృష్టవంతురాలో తెలిసేది మాత్రం ఆమె పెళ్లి అయిన తరువాతే…..

 

ఒంట్లో బాగోలేదని హాస్పిటల్ కి వెళ్తే ఆ డాక్టర్ ఒక సైకో లా ప్రవర్తిస్తాడు.

బట్టల షాప్ కి వెళ్తే వాడు ఎక్కడెక్కడో ముట్టుకుంటాడు…..

బస్ లో వెళ్తే కావాలని మీద పడతారు…

చిన్నపిల్ల నుండి పండు ముసలమ్మ వరకు ప్రతి పనిలోనూ మహిళకు అన్యాయం జరుగుతునే ఉంది….

అన్యాయం అంటే ఆమెని కొట్టాడమో తిట్టడమో కాదు ఆమెకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోవడం…

– మేఘమాల

Related Posts