ఆశ

ఆశ

మధ్యతరగతి వారి జీవితమే ఓ ఆశ…
జీవన పోరాటాల మధ్య ఎడతెగని మెలిమి ఓ ఆశ…

నిన్నటిని వదిలి
రేపటికై ప్రయాణంలో
నేటి భౌతికస్థితియే ఓ ఆశ…

ఆలోచనల సంగమాల యుద్ధంలో తనే గెలుస్తూ
నిరాశల ఉత్సాహాన్ని మరిపిస్తు ముందుకు నడిపించేది ఓ ఆశ…

జీవితాన్ని నిలబెట్టేది ఆశే
జీవితాన్ని కడవరకు కొనసాగించేది ఆశే
నిన్నటిని గెలిచేది కూడాను ఆశ

– గోగుల నారాయణ

Related Posts