ఆశ

ఆశ

ఈ రెండు అక్షరాల వరమే
దేవుడిచ్చిన బలం

ఆశే జీవన రాగం
శ్వాస నే బ్రతుకు ఆశ

ఆశను ఆశ్రయిస్తే
అంతులేని ఆనందం

ఆశే మిత్రుడు
ఆశే వెంటాడే శత్రువు

ప్రతిరోజూ ఆశే
బ్రతకడానికి చిగురాశ

కోరుకున్నది జరగాలని ఆశ
ఆలోచనల మీమాంస

ఆశకు అదుపు వుంటే
గతి తప్పని గమ్యం అది

ఆశయాల ఒడ్డుకు
ఆశతో దాటాలి

తీరని ఆశ కాకుండా
తీరాల వరకు పరుగెత్తా లి

కనిపించని దూరాన్ని
నడిపించే నీ దారే ఆశ

మితిమీరిన ఆశే అన్నీ
దూరం చేస్తుంది సుమా

తస్మాత్ జాగ్రత్త ……

– జి జయ

Related Posts