ఆశ

ఆశ

ఆశ కు అంతులేదు
అగాధానికి లోతు తెలియదు అంటారు

ఆశ నిరాశల సయ్యాట
జీవిత పయనం

ఆశే ప్రాణం ఆశే నిజం
ఆశే వెలుగు ఆశే చీకటి
ఆశే మిత్రుడు ఆశే శత్రువు
ఆశే ఆవేదన ఆశే సంతోషం
ఆశే అడుగు ఆశే పిడుగు
ఆశే గమ్యం ఆశే విజయం
ఆశే ఆలోచన ఆశే శ్రమ
ఆశే అవసరం ఆశే నమ్మకం
ఆశే పొదుపు ఆశే మదుపు
ఆశే అదృష్టం ఆశే దూరం
ఆశే ఆశయం ఆశే ఇష్టం
ఆశే అజ్ఞానం ఆశే విజ్ఞానం
ఆశే విలువ ఆశే శిలువ
ఆశే కల ఆశే తోడు
ఆశే అపూర్వం
ఆశే జీవిత పోరాటం
ఆశే ఆ జన్మాంతం వెంటాడే
వేటగాడు .
అది అదుపులో వుంటే
అంతకన్నా గొప్ప ఇంకేముంది.

– జి జయ

Related Posts