ఆశల పల్లవి – గేయం

ఆశల పల్లవి – గేయం

పల్లవి
స్త్రీ అంటే మమతని
స్త్రీ అంటే కరుణని 
తెలుసుకో మనిషీ 
తెలిసి మసలుకో మనిషీ
చరణం
చైతన్యమూర్తియై కాపాడును తాను
తనులేని జగతిని ఊహించలేము 
చీకటిలో నీవుంటే నీవెలుగే తాను కదా
నీ కంటిపాపయై లాలించు దేవతగా
చరణం
ఆడపిల్ల ఉన్నచోట ఆశదెంత సంబరము
నింగిలో సగమైనా ఇంటికో పూర్ణత్వం
విడనాడి మూర్ఖత్వం ముందడుగే 
వేయిద్దాం 
సమానతను సాధించే అవకాశం తనకిద్దాం
చరణం
తనపట్ల హింసనే గర్హించుదామండీ
తల్లడిల్లు హృదయానికి నీడనిచ్చుదాము
జగతిలోన స్త్రీ శక్తి లేకుంటే అధోగతే 
తప్పునే దిద్దుకుంటే సుఖశాంతులు మనఇంట
మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో
– సి.యస్.రాంబాబు

Related Posts