ఆశల తిమిరాలు..

ఆశల తిమిరాలు..

రవిచంద్రులకే నిలకడలేని…
అశాశ్వతమైన అవనిలో…
పగటి వెలుగుల ఉజ్వల కాంతులు శాశ్వతం అనే భ్రమలో..
క్షణిక ఆనందాల పందేరంలో..
నిలకడ లేకుండా..
నిదురను మరిచి..
ఆశల తిమిరాల వెంట..
ఆత్రుతగా పరుగులు తీశాను..
కానీ ఇప్పుడు రాత్రి పొద్దు పోయాక…
చిరు చీకట్లు అలుముకుంటున్న..
ఈ సవ్వడి లేని సాయంకాలాన…
నెమ్మదిగా ఎరుకలోకి వస్తోంది..
నా చిరు ఉనికిని చిరస్మరణీయంగా
మలుచుకోవడమే మరిచానని..
ఇప్పుడు వగచి ఏం ప్రయోజనం..?
ఈ సార్వజనీన సత్యం అవగతమయ్యేసరికి..
సర్వశక్తులు ఉడిగిపోయి..
శాశ్వతత్వానికి చేరువలో ఉన్నాను..

– మామిడాల శైలజ
అసిస్టెంట్ ప్రొఫెసర్

Related Posts