ఆత్మ

ఆత్మ

అమ్మా రెడీ నా అంటూ వచ్చాడు ప్రణవ్. హా రెఢీ రా అన్నాను, సరే పద పద అసలే నువ్వు మొదటి నుండి సినిమా చూడాలి అంటావు, ఆలస్యం అయితే మళ్లీ నన్నే తిడతావు అన్నాడు.

అబ్బో సర్లేరా ఆటో వచ్చిందా అన్నాను. అంత లేదు. బైక్ ఉండగా ఆటో ఎందుకే, అంటూ ముందుకు కదిలాడు. ఇద్దరం కలిసి బైక్ పైన సినిమా హల్ కు వెళ్ళాము.

ఆల్రెడీ టికెట్స్ బుక్ చేశాం. కాబట్టి అవి ఫోన్ లో చూపించి లోపలికి వెళ్ళాము. సీట్లలో కూర్చున్న తర్వాత నాకు అందులో ఎవరో ఉన్నట్టు అనిపించింది.

లేచి చూసాను, కానీ ఎవరు లేరు. మళ్ళీ కూర్చున్నా… ఒకరి పై మనం కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు, మళ్లీ లేచి చూసాను. ఎవరు కనిపించలేదు.

నేను అలా రెండు సార్లు లేవడం చూస్తున్న ప్రణవ్, ఏంటమ్మా, ఏమైంది నల్లులా అన్నాడు. కాదు రా ఇందులో ఎవరో కూర్చున్నారు అన్నాను. వాడు లేచి వచ్చి ఫోన్ లో లైట్ పెట్టీ చూస్తూ.. అమ్మ ఎవరు లేరు. అది మనం బుక్ చేసిన సీటే నువ్వు అలా ఫీల్ అవుతున్నావు. అంతే అంటూ కూర్చో అన్నాడు.

నిజమే కదా మేము బుక్ చేసిన సీట్లలో ఎవరు కూర్చుంటారు అనుకుని మళ్లీ కూర్చున్నా, కానీ నాకు అదే భావన కలిగింది. మళ్లీ లేచాను అనీజీగా ఉందని.

ఈ సారి మా ప్రణవ్ చిరగ్గా చూస్తూ ఎంటమ్మ నువ్వు రాక, రాక సినిమాకు వస్తే ఇలా చేస్తావ్, చూడు అందరూ మనల్నే చూస్తున్నారు అంటూ అన్నాడు.

దాంతో  నేను చుట్టూ చూసాను. హై క్లాస్ కాబట్టి అరవలేక మా వైపు చిరాగ్గా, కోపంగా, లేచి తన్నాలంత భావాన్ని కళ్ళలో చూపిస్తూ, మా వైపు కొర, కొరా చూస్తున్నారు.

దాంతో నేను ఇక ఏం అనలేక ప్రణవ్ వైపు చూసాను. అమ్మ నల్లులు అయ్యి ఉంటాయి. కూర్చో పర్లేదు అన్నాడు. నేను ఇబ్బంది గా చూస్తూ రేయ్ నాన్న సీటు మార్చారా అన్నాను కాస్త జాలిగా…

అమ్మ చూసావా ఫుల్ రష్ ఉంది. అసలే పెద్ద సినిమా సీట్లు ఎక్కడ ఖాళీ ఉన్నాయి నువ్వే చూడు. వెంకీ మామ సినిమా ఫుల్ గా ఉంది. కుదరదు కానీ కాస్త ఓపిక పట్టు మూవీ అవ్వగానే వెళ్దాం అన్నాడు.

ఇక అందరూ మా వైపు చిరాగ్గా చూడడం వల్ల ఏం అనలేక మౌనంగా కూర్చున్నా… కానీ నాకు తెలుస్తుంది సీట్ లో ఇంకెవరో ఉన్నారని, దాంతో ప్రణవ్ నీ నా సీటు లోకి రమ్మని నేను వాడి సీటు లోకి వెళ్ళాను.

వాడు వచ్చి కూర్చుని హ్యాపీగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. నేను వాడి ని ఆశ్చర్యం గా చూసాను. నాకు కలిగిన ఫీలింగ్ వాడికి కలగలేదు ఎందుకో అని, ఇక సినిమా ఇంటర్వెల్ అయ్యింది. వాడు బయటకు వెళ్లి వచ్చాడు.

పాప్ కార్న్, స్ప్రింగ్ రోల్స్ తెచ్చాడు. ఎప్పుడైనా వాటిని ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని, కానీ ఈ సారి అలా చేయలేక పోయాను. నా సీట్ లో కూర్చున్న ప్రణవ్ ఆ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తూ చూసాడు. నేను సగం నుండి చూసాను. నా మనసులో ఏదో గుబులు గా అనిపించింది.

ఎలాగో సినిమా పూర్తి అయ్యింది. మేము బైక్ దగ్గరికి వస్తుంటే అక్కడ ఇద్దరు వ్యక్తుల మాటలు మాకు వినిపించడంతో చటుక్కున ఆగిపోయాము. ఆ మాటలు వాళ్లు బిగ్గర గానే మాట్లాడుకుంటున్నారు. దాని సారాంశం ఏంటంటే …

వారం క్రితం ఆ సినిమా హాల్లో ఒకతను సినిమా చూస్తూ హార్ట్ ఎటాక్ తో అక్కడే సీట్లోనే చనిపోయాడు అంట. అది తెలిసిన సినిమా హల్ వాళ్ళు కొన్ని రోజులు మూసేసి ఈ రోజే తెరిచారు అంట…

అతను చనిపోయిన సీట్ ఏదో కాదు నేను కూర్చున్న సీటే అది తెలిసిన నేను వణికి పోయాను. అది అత్మనా, మనీషా అనేది నాకు అర్దం కాలేదు.

అయినా చనిపోయిన వాళ్ల ను ఆత్మనే అంటారు కదా, అంటే నేను కూర్చున్నది ఆత్మ పైనా, ఆ ఆలోచన రాగానే ముచ్చెమటలు పట్టాయి.

అంటే అంటే నేను కూర్చున్నది ఆత్మ పైనా, అనే ఆలోచన తో ప్రణవ్ చెయ్యి గట్టిగా పట్టుకున్నా, ఇక వాడు నన్ను పట్టుకుని బైక్ ఎక్కించి, ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

భయం తో నేను ఆ రాత్రంతా నిద్రలో ఉలికి పడుతూనే ఉన్నాను. పాపం ప్రణవ్ నిద్రపోకుండా నన్ను జాగ్రత్తగా చూసుకున్నా కూడా నాకు జ్వరం వచ్చేసింది.

ఆ హల్ కి అప్పటినుండి ఇప్పటి వరకు అస్సలు వెళ్లనే లేదు…..

– అర్చన

Related Posts

2 Comments

  1. ఆత్మలు ఉన్నాయంటారా?
    ఏమో మరి నేను చూడలేదు.

Comments are closed.