ఆత్మ ఘోష

ఆత్మ ఘోష

స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నారు కదా
ఇస్తీరి బట్టలు వేసుకుని, తళతళ లాడే బూట్లు
వేసుకుని, చేతికి బంగారు బ్రాస్లెట్స్ సవరించుకుంటూ
పెదాల పై బూటకపు చిరునవ్వు నవ్వుతూ, బట్టల
వెనకాల మలిన మనసు తో, కుళ్ళు, కుతంత్రాలు చేస్తూ
జెండా వందనం పేరుతో కోట్ల రూపాయలు మెక్కుతూ
పది రూపాయల కొబ్బరికాయ కొట్టి, నాలుగు అగరు వత్తులు వెలిగించి లేని దేశభక్తిని చాటుకుంటూ,
జెండాలు ఎగురవేసి, మిఠాయిలు పంచుకుంటూ, వాటిలో వెరైటీలు వెతుకుతూ, వచ్చి రాని మాటలు మాట్లాడుతూ, దేశం కోసం పోరాడిన వారి గురించి
నాకే తెలుసు అని నేనేదో వారికి సేవలు చేశాను అంటూ
గొప్పలు చెప్పిన రాజకీయా రాబందుల రాజ్యంలో….
దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాలు
పిడికెడు అన్నం కోసం, కొంచం ఓదార్పు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మీకు కనిపించడం లేదా… వీర మరణం పొందిన వాళ్ళే మీకు కనిపిస్తారా..
దేశం కోసం పోరాడిన వారిలో కాళ్ళు, చేతులు పోగొట్టుకుని, అష్ట దరిద్రాన్ని అనుభవిస్తూ, కుటుంబాలను పోషించలేక, భారం అయిన బతుకుతో పోరాడుతున్న
సైనికుల కుటుంబాలు మీకు కనిపించడం లేదా..

రెండు కాళ్ళు, రెండు చేతులు పోయిన వాళ్ళు కొందరు
కళ్ళు కోల్పోయిన వాళ్ళు కొందరు, నడుంలు పడిపోయిన వాళ్ళు కొందరు తమకు రావాల్సిన పథకాలు రాక, ఆర్థిక సహాయం లేక, సరైన వైద్యం అందక, ప్రభుత్వ అధికారుల ఆఫీసుల చుట్టూ తిరిగే జవాను లేందరో.. కుటుంబ భారం కష్టం అయ్యి, కుటుంబానికి భారం కాకుండా తమ తనువును చాలిస్తున్న సైనికులు ఎందరో వారి బాధ మీకు కనిపించడం లేదా, సహాయాలు అందించామని, మంచి వైద్యం, ఉద్యోగం ఇప్పిస్తామని మాటలు మాత్రమే చెప్పే నాయకుల్లారా ఆ సైనికుల ఆకలి కేకలు మీకు కనిపించడం లేదా వారి ఆత్మఘోష మీకు వినిపించడం లేదా…

– భవ్యచారు (గారి రచన)

Related Posts

1 Comment

  1. అవును..ఏదో ఒక సందర్భంలో కేవలం మాటల ద్వారానే మెడలు కట్టి చేయాల్సిన కర్తవ్యాన్ని మాత్రం విస్మరించి వారే ఎక్కువ. చాలా బాగా రాసారు భవ్య గారు నైస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *