ఆవలితీరం
మనిషి జీవితమో పాఠశాల
మనసు మాత్రం కోరికల పాకశాల
సుఖశాంతుల తోటలో
విరబూసే పూలు పిల్లలు
వేదనలు వేడుకలు
జమిలిగా సాగుతూ జీవితాన్ని సాగుచేస్తాయి
నవ్వే కాలం కాలుదువ్వినా
మనసును మాత్రం దువ్వుతుంది
బంధాలు బాధ్యతల
కావిడి బరువుతో కరుసై పోతావు
నేను నా కుటుంబం అన్న తృప్తిని మోస్తూ
ఆవలి తీరం చేరతావు
– సి.యస్.రాంబాబు