"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

అబద్ధం, నిజం

అబద్ధం, నిజం

ఒకరికొకరు బాగా పరిచయం.

ఈ బావిలో నీళ్ళు చాలా బాగున్నాయి కలిసి స్నానం చేద్దామా అని అడిగింది అబద్ధం, నిజంతో అలా ఇద్దరూ కలిసి బావిలో దిగారు, స్నానం చేశారు. అకస్మాత్తుగా హడావుడిగా స్నానం ముగించుకొని అబద్ధం బావి నుంచి బయటపడి పరుగు తీసింది నిజం బట్టలేసుకుని !

నిజానికి బాగా కోపం వచ్చేసింది. మెట్లెక్కి బావి బయటకు వచ్చేసింది. నిజానికి తన బట్టలు కనిపించలేదు. అలాగే నిజం వీధుల్లోకి వచ్చింది. నిజాన్ని అలా చూసిన ప్రపంచానికి కోపమొచ్చింది. అసహ్యమేసింది, దాన్ని చూడలేక మొహం తిప్పేసుకుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేని నిజం, నిస్సహాయంగా మళ్ళీ బావిలోకి దిగిపోయి శాశ్వతంగా కనపడకుండా అదృశ్యమైంది.

ఇది జరిగినప్పటినుంచి, అబద్ధం, నిజం యొక్క బట్టలేసుకుని, తన్నుతాను సింగారించుకుని ప్రపంచాన్ని చుట్టేస్తున్నది. దాన్ని చూసి సమాజం కూడా మహా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ప్రపంచానికి సత్యాన్ని తెలుసుకోవడంపై ఎలాగు ఆసక్తి లేదు కాబట్టి..

– మల్లికార్జున్ గుండా

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *