అబ్బాయికి గజ్జెలు కట్టడం

అబ్బాయికి గజ్జెలు కట్టడం

అబ్బాయికి గజ్జెలు కట్టడం

జనిత అందమైన అమ్మాయి , ఆమె కుటుంబం పెద్దది. ముగ్గురు చెల్లెలు, ఒక తమ్ముడు. తండ్రి లెడు తల్లి ఏదో పనులు చేస్తూ పిల్లలను పోషించేది. ఇప్పుడు తల్లికి కూడా ఓపిక లేక పోవడం తో జనిత చదువుకుంటూ నే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇంటిని , తన చెల్లెళ్ళ ను చూసుకుంటూ ఉండేది.

జనిత పార్ట్ టైం జాబ్ చేసే దగ్గర వివేక్ అనే అబ్బాయి కూడా పని చేసేవాడు. అతనికి నా అంటూ ఎవరూ లేరు అతనొక అనాథ. జనిత అతనితో ఎప్పుడూ మాట్లాడేది కాదు. తన పనెంటో తాను చూసుకుని వెళ్ళిపోయేది తప్ప ఎవరితో మాట్లాడేది కాదు.

కానీ అతను మాత్రం జనిత జాబ్ కి వచ్చిన మొదటి క్షణం లోనే ఆమె తో ప్రేమలో పడ్డాడు. కానీ అతనికి చెప్పడానికి భయం వేసింది. అలా ఊరుకోకుండా ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆమెకు సాయం చేయాలని అతనికి చాలా ఉండేది.కానీ జనిత ఎవర్ని సాయం అడిగేది కాదు. తన కష్టం తోనే తన అవసరాలు తీర్చుకునేది. అతను మాత్రం ఆమెతో ఎప్పుడెప్పుడు తన ప్రేమ విషయం చెప్పాలా అని ఎదురుచూస్తూ ఉన్నాడు.

జనిత రెండో చెల్లెలు హరిత. హరిత డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది. ఆమెకు కాలేజీలో నృత్య పోటీలు పెట్టారు.అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే అందులో గెలిచిన వారికి పదివేల రూపాయల బహుమతి ఉంటుంది అని ప్రకటించడం తో హరిత వచ్చి జనిత తో ఆ విషయాన్ని తెలిపింది.

నిజానికి జనిత కు ఇంటి కిరాయి కి అలాగే ఫీజులకు కూడా డబ్బులు అర్జెంట్ గా కావాలి. అందువల్ల హరిత ను నాట్యం నేర్చుకోమని కోరింది. రెండు రోజులు నేర్చుకున్న హరిత ఇక నా వల్ల కాదంటూ చేతులు ఎత్తేసింది. చిన్న చెల్లెలు నాకు రాదంటూ తప్పించుకుంది. జనిత చిన్ననాటి నుండి మగాడిలా పెరగడం వల్ల తాను ఒళ్ళు విల్లులా వంచలేదు.

ఇంకేం చేయాలో తోచలేదు. అలాగే పార్ట్ టైమ్ జాబ్ కి వెళ్ళింది కాని మనసులో ఆలోచనల వల్ల సరిగ్గా పని చేయలేక పోయింది. ఆలోచిస్తూనే పనిలో తప్పు చేసి బాస్ తో తిట్లు కూడా తిన్నది. మనసు భారంగా మారడం తో ఏం చేయాలో తెలియక ఇంటి దారి పట్టింది.
**
హరిత కాలేజీ లో నాట్య ప్రదర్శన రోజు రానే వచ్చింది. ఆ రోజు తాము చేయక పోయినా మిగిలిన వాళ్ళు ఎలా చేస్తారో ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి తో నలుగురు ఆ ప్రదర్శనకు వెళ్ళారు.

అందరూ చాలా చక్కగా నాట్య కళ ప్రదర్శిస్తున్నారు.వారిని చూస్తూ అందరూ మైమరచి పోయారు. తరువాత శివ తాండవం అని అనౌన్స్ చేయగానే అందమైన ముఖ వర్చస్సు తో అర్ధనారీశ్వర అవతారం లో ఒకమ్మాయి స్టేజ్ పైకి వచ్చింది.

అందరికీ నమస్కారం చేసి తన నాట్యన్ని మొదలు పెట్టింది. అది చూస్తున్న అందరూ నిజంగానే శివుడే వచ్చి నాట్యo చేస్తున్నాడా అనే పరవశం లో మునిగి పోయారు. అమె ప్రదర్శన అవ్వక ముందే కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రదర్శన అయ్యాక ఆ అమ్మాయిని అందరూ చుట్టూ ముట్టారు సంతకాల కోసం , పోటోల కోసం కానీ ఆమె ఎవరికీ చిక్కకుండా చటుక్కున తప్పించుకుంది. అందరూ అయ్యో అనుకున్నారు.

ఈ లోపు ప్రదర్శన ప్రకటించిన వారు శివతాండవం చేసిన అమ్మాయికి పదివేల రూపాయలు బహుమతి ప్రకటించడం, ఆమె వచ్చి తీసుకోవడం జరిగిపోయింది. ఆ సందడిలో జనిత హర్షిత, ఆమె తమ్ముడు చెల్లెలు తలో దిక్కు అయ్యారు. అదే సందడిలో జనిత బ్యాగ్ ను ఎవరో లాగినట్టు అనిపించింది. తిరిగి చూస్తే ఎవరూ లేరు.

సరే అనుకుంటూ చెల్లెళ్ళ వెతుక్కుని ఇంటికి బయలు దేరింది. అందరూ ఆలోచిస్తున్నారు మేము కూడా పాల్గొంటే మా కష్టాలు తిరేవి కదా అని, కానీ అందరూ మౌనంగా ఉండి పోయారు. ఎవరికీ మాటలు రావడం లేదు. ఇంట్లోకి వచ్చారు.

జనిత కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకుని మౌనంగా ఉన్న వారిని ఉత్సహా పరుస్తూ రండి రండి అబ్బా చాలా ఆకలిగా ఉంది అంటూ పిలవడం తో అక్క వైపు భాధగా చూసారు. ఈ లోపు కిటికీ లోంచి ఏదో కాగితం ఉండ పడింది. ఈ రాత్రి ఇలా వేసింది ఎవరా అని ఆ ఉండ తీసి చూశారు.

అందులో ఒకే ఒక్క వాక్యం ఉంది మీ బ్యాగ్ చూసుకోండి అని అది చదివగానే అందరూ పాలోమని జనిత బ్యాగ్ పై ఎగబడ్డారు. ఏయ్ ఆగండి అది నా బ్యాగ్ నేనే చూడాలి అంటూ వారందర్నీ బెదిరించి తన బ్యాగ్ తీసుకుని చూసింది. అందులో పదివేల రూపాయల తో పాటూ ఒక కాగితం కూడా ఉంది .

కాగితం విప్పి చదవడం మొదలు పెట్టింది జనిత ..

జనిత గారికి నమస్తే నేను వివేక్ మీరు పనిచేసే చోట నేను పని చేస్తున్నాను కానీ మీరెప్పుడు నన్ను గమనించ లేదు నేను మాత్రం మొదటి చూపులోనే మీతో ప్రేమలో పడ్డాను. మీ కష్టాలు అన్ని నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా ఒక అనాథ కాబట్టి ఆ బాధ నాకు తెలుసు.

 

మీకు కష్టాలు ఉన్నాయని తెలిసి, మీకు ఎలాగైనా సాయపడలి అనుకున్నాను. అందుకే చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న నాట్యం నాకు ఈ రోజు మీకు సాయపడడానికి ఉపయోగ పడింది.

అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఆత్మాభిమానం ఎక్కువే అని తెలుసు. కానీ అవసరానికి వాడుకోండి. తర్వాత నాకు తిరిగి ఇవ్వండి. ఇక నా గురించి చెప్పాను కద అనాథ అని మీరు ఒప్పుకుంటే మీ ఇంట్లో ఒక సభ్యునిగా అవ్వాలని నా కోరిక. మీరు ఒప్పుకుంటారు అనే ఆశ తో , నమ్మకం తో ప్రస్తుతానికి వివేక్ , తర్వాత జనిత మొగుడు 🙂 అని ఉంది.

జనిత అది చదవగానే ఏడుస్తూ కూలబడింది. తనకేమీ కానీ ఒక వ్యక్తి తన కోసం గజ్జె కట్టి మరి డబ్బులు ఇచ్చాడు. అది కూడా ఆత్మాభిమానం అని తెలిసి అప్పుగా అన్నాడు.

నిజంగా ఎంత మంచివాడు. వేరే వాళ్ళలాగా పిచ్చిగా చేయకుండా హుందాగా ప్రవర్తించారు. ఎంత మంచి మనసు అనుకుంటుంటే అదే ఉత్తరం చదివిన మిగిలిన వాళ్ళు అబ్బా అక్క ఇంత మంచి వాడిని నువ్వు వదుకు కోవద్దు.

నువ్వు ఒప్పుకుంటావో, లేదో, తెలియక పోయినా సాయం చేశాడు అంటే ఎంత మంచి మనసు అంటూ వివేక్ కి పొగిడారు. అలా ఆ రాత్రి గడిచింది.
***
కొన్నాళ్ళ తర్వాత జనితా నిలయం అనే బోర్డు తగిలిస్తూ వివేక్ అతనికి సాయం చేస్తూ మరదళ్ల వాళ్ళ భర్తలు, బావమరిది తో నూతన గృహ ప్రవేశం చేశారు నూతన దంపతులు.

 

శుభం

 

-భవ్యచారు

 

నువ్వే ప్రాణం Previous post నువ్వే ప్రాణం
గురు బోధ Next post గురు బోధ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close