"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

అడగని భేతాళుడనై

అడగని భేతాళుడనై

దృశ్యం కాలేని ఉనికి చిత్తాన్ని
ఊహిస్తున్నా…మిడిసి పడుతున్న
కల్పనా చాతుర్యానిది ఒక లోకమా…లేక
చతుర్విద విన్యాసాలకు నేనర్హుడనాని…
వడగట్టని క్షణాలతో ముఖాన్ని
మార్చుకుంటు కనిపించని లోకాన్ని
వెదకడమేనా ఈ జీవిత పరమార్థం…

నిత్యంతో పోరాటం కాదు…
అనునిత్యంలో నా ఆకలి బాదకు అర్థం
దొరుకుతుందాని…తారతమ్యాలు
తామసాలతో పొరలు నిండక పోకడలు
తెలియక…అమాయకత్వం పూడ్చిన
నా సత్య వెలుతురును చూడని సమాజం
నాకిచ్చిన బిరుదు పిచ్చోడని….

నేను నిశ్చలత్వుడను…!!
వాస్తమేదనో అడగని భేతాళుడనై
వికాసాన్ని విభజించబడిన కేంద్రకంగా
కోల్పోయి…చేయూత నివ్వని
మస్తిష్కంతో కోరికలను ఎండగడుతు…
స్వార్థాన్ని ఏరి పారేసిన గడ్డి పరకగా
సువిశాల ప్రపంచంలో స్వేచ్ఛను గెలిచిన
సాధకుడను నేనే….

గమనిస్తున్నా కాల రచనలను
కాల్పనికునిగా…ఆదరణ కరువైన
మానవత్వం మనుషుల మధ్యన
బతుకుతుందాని…పంచ భూతాలను
సగౌరవ పరిచిన నా జీవితం పిచ్చిదని
అగౌరవ పరిచిన సభ్యసమాజం
మనుషులకని ఏ ఉపనిషత్ తీర్మాణమో
మారలేక పోతుంది మనుషుల దుస్థితి…

– దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *