అద్దె ఇల్లు

అద్దె ఇల్లు

అద్దె ఇల్లు

రజియా బేగం ఆరుగురు పిల్లలను కన్నది..దాంట్లో ముగ్గురు ఆడ పిల్లలు ముగ్గురు మగ పిల్లలు అంతా చిన్న చిన్న వాళ్లుగా ఉన్నప్పుడే ఆమెకు స్వంత ఇల్లు కట్టుకోవాలని కోరిక..భర్త పండ్ల వ్యాపారం చేసేవాడు దాని మీద వచ్చే ఆదాయంతో ఇళ్లు గడవడమే కష్టంగా ఉండేది
మగ పిల్లలు కొద్దిగా పెరగంగానె వాళ్లను మెకానిక్ షాపుల్లో బ్రెడ్ అమ్మడంలో పనికి కుదిర్చి తను కూడా ఇంట్లో మిషను కుట్టి కొంత డబ్బు ఆదా చేయడం మెుదలు పెట్టింది..
అలా కొంత డబ్బు జమ అయ్యాకస్థలం కొన్నది..ఆ చిన్న చిన్న పిల్లలను పట్టుకునే ఎలాగో ఇళ్లయితే కట్టింది..ఇటుకలతో మాత్రం కట్టింది దానికి సున్నం అదీ ఏమీ చేయించ లేదుఅయినా స్వంత ఇళ్లు కోరిక చాలా కాలానికి నెర వేరింది..ఆ ఇంట్లోకి వెళ్లీ వెళ్లగానె మిగతా మరమ్మత్తులు చేయకుండానె ఆడ పిల్లల పెళ్లిల్లు చేయవలసి వచ్చింది..

తరువాత మగ పిల్లలవి ఇలాగ అన్నీ ఖర్చులతో కూడుకున్న పనులే అయ్యాయి..
తనకొక మంచి రూము దాంట్లో కుట్టు మిషను పెట్టుకోవాలని చాలా కోరిక కానీ అసలేవీ తీరనే లేదు ఇంతలోనె భర్త రఫీ అల్లా అన్నాడు ..అంతే! అంటే అల్లాను చేరుకున్నాడు..

పిల్లలేమెా తలో దగ్గర సెటిల్ అయ్యారు రజియా బేగం ను తలా నెల ఉంచుకోవాలను కున్నారు కొడుకులు..ఆ ఇళ్లు మరమ్మత్తులు రజియాకి అక రూము కట్టే ఆలోచన ఎవరికీ లేదు పైగా పంచుకోవడం కోసం అమ్మేసారు..రజియా ఇప్పుడు అద్దె ఇంట్లో నెలకో సారి కొడుకుల దగ్గరకు వెళ్తూ వస్తూంది..
అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలే రజియాను చిన్నచూపు చూస్తున్నట్టే అనిపిస్తుంది..
అల్లాను తలుచుకుంటూ భారమైన జీవితం గడుపుతుంది..

-ఉమాదేవి ఎర్రం

పిల్లల భవిష్యత్తు కోసం Previous post పిల్లల భవిష్యత్తు కోసం
షాక్ Next post షాక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close