అదే చాలా మంచింది
పుర్వంలో పల్లెల్లో వున్నవన్ని ఉమ్మడి కుటుంబాలె.. ఒక కుటుంబంలో పదుల సంఖ్యలో సభ్యులుండే వారు. కుటుంబంలో ఇద్దరు, లేదా ముగ్గురు ఆడవారు ఇంటిపనికి వుంటే మిగతా వారు పొలం పనులకు వెళ్లే వారు. అదే విధంగా గ్రామంలో కుటుంబాలు అన్ని కలిసి ఒకే కుటుంబంగా మెలిగేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ఊరంతా వారిని ఆదుకునే వారు. ఒక కుటుంబంలో పెళ్లి, లేదా ఇతర శుభ కార్యం జరిగినా.. చావు లాంటి అశుభ కార్యం జరిగినా ఊరి వారంతా చేరి ఐకమత్యంతో మెలిగేవారు.
అయితే ప్రస్తుతం సమాజంలో ఉమ్మడి కుటుంబం అసలు కనిపించడం లేదు.. ఎక్కడ ఐకమత్యము, ఆత్మీయత, ప్రేమ, అనురాగము అనేవి కుటుంబంలో కనిపించడం లేదు. పక్కింట్లో ఏదైనా ఆపద సంబవిస్తే.. మాట వరుసు పలకరింపులు తప్ప మరే సహాయ సహకారాలు అందంచడం లేదు.. కానుక ఊమ్మడి కుటుంబంలో వుండే ఆనందం మరీ ఎక్కడ ఉండాదు.
అందువల్ల పూర్వ రోజులులా అందరూ కలిసి ఒకే కుటుంబంలో కలిసి మెలిసి ఉండాలి. ఉమ్మడి కుటుంబంలో ఆర్థిక భారం అందరు పంచుకోవడం ద్వారా ఆర్థికంగా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండావు. ఏ కుటుంబంలో అయిన ఆర్థిక ఇబ్బందులు లేకుంటే ఆ కుటుంబం బంగారు కుటుంబంగా ఉంటుంది.
ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లల కంటే చిన్న కుటుంబంలో పెరిగిన పిల్లలకు తక్కువ తెలివి వుంటుంది. అందువల్లె చిన్న కుటుంబం కంటే ఉమ్మడి కుటుంబం చాలా మంచింది.
– మంజుల