అజ్ఞాత వ్యక్తి

అజ్ఞాత వ్యక్తి

కొన్ని రోజులుగా నేను చెప్పుకోలేని ఒక సమస్య తో బాధ పడుతున్నా… అదేవరికి చెప్పుకోలేని సమస్య ఎలా ఏం చేయాలో అర్థం కాలేదు. నెలాఖరు రోజులు ఎవర్నీ అడిగినా డబ్బు సాయం అందడం లేదు.

అడిగితే లేదనే సమాధానం కన్నా అడగకుండా ఉండడమే మంచిది అని ఎవర్నీ అడగలేదు.కానీ సమస్య తీవ్రత ఎక్కువ అవుతుంది. ఏం చేయాలి తెలియక నా సోషల్ మీడియా తెరిచాను.

నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇంట్లో పెంచాలని ఎప్పటి నుండో అనుకున్నా, అందుకోసం అంతకు ముందు నా సోషల్ మీడియా అకౌంట్ లో అడిగాను.

ఫలానా మొక్క కావాలని, తర్వాత నేను అది పట్టించుకోలేదు నా సమస్య వల్ల, అయితే నేను నా అకౌంట్ తెరవగానే ఒక సందేశం, ఆ మొక్క నేను పంప లేను కానీ అందుకు అయ్యే డబ్బు సాయం చేయగలను అంటూ ఒకరు మెసేజ్ చేశారు.

నా సంతోషానికి అవధులు లేవు. వెంటనే నేను తనకు నాకు మొక్క కాదు. ఇలా ఒక వేరే సమస్య వచ్చింది అని కానీ అది చెప్పలేను అన్నాను.

దానికి వాళ్ళు పర్లేదు మీకు ఎందుకో ఒకందుకు ఉపయోగ పడుతుంది కదా అంటూ అన్నారు.

కానీ నాకు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేదని అనగానే మీరు ఏదైనా షాప్ కి వెళ్లి అడగండి నేను వారికి పే చేస్తాను. మీరు డబ్బు తీసుకోండి అన్నారు.

దాంతో నేను అలాగే చేశాను. పాపం వాళ్ళు పంపారు. నా సమస్య తీరిపోయింది. చిన్న అమౌంట్ అయినా ఆ సమయం లో వాళ్ళు గనక సాయం చేయక పొతే నా పరిస్థితి ఎలా ఉండేదో తల్చు కుంటుంటే ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది.

వాళ్లకు నేనెవరో తెలియదు. ఎక్కడ ఉంటానో తెలియదు. నేను మళ్ళీ ఇస్తానో లేదో తెలియదు. నాకు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలియదు. కానీ నేను చెప్పగానే స్పందించి సాయం చేశారు.

ఇలా సాయం అడగడం తర్వాత మోసం చేయడం ఈ జనరేషన్ లో జరుగుతుంది. కానీ వారిని మాత్రం నేను నా జీవితం లో మర్చిపోను.

వారికి ఇలా ఈ రూపంలో కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. మీరు చేసిన సాయం మరవ లేను. నా జీవిత కాలం మిమల్ని ఒక దేవుడిలా భావిస్తాను. మీకు శతకోటి వందనాలు ..🙏🙏🙏 (నిజ సంఘటన)

– భవ్య చారు

Previous post కళ్ళగంతల జీవితం!!
Next post అజ్ఞాతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *