అగ్నిపూలు

అగ్నిపూలు

నిదుర తెరలు కప్పుకుందామని నానా అగచాట్లు పడుతూ నేనుంటే
నీవేమో ఇలకు దిగిన వెండి చందమామలా మారి
సిగ్గుపూల మొక్కల నడుమ దాగి అందీఅందక
ఊపిరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటావు
ఎడారి గుండెలోన కలలే ఫలించి నా చెంత చేరిన నిన్ను చూస్తూ ఎన్ని కాలాలు…

ఏ సవ్వడి ఆగమన సూచనలు ఇవ్వకుండా ఎలా గడిచిపోయాయో లెక్కేసుకుంటున్నాను.
సప్తవర్ణాల హరివిల్లుకు ఊహల ఊయలలే
గట్టిగా కట్టి మూడేసుకున్నానేమో మరి
చిగుర్చిన చెట్టునై నీ రాక కొరకు వేచిచూస్తున్నా
కోరివచ్చె కొమ్మ దరిచేరి ఏలుకోమ్మ
శిశిరాలు ఎన్ని ఏకమై నా ఆశలు నిట్టనిలువుగా రాల్చిన గ్రీష్మంలో నీ కోసం వికసించే అగ్నిపువ్వునై
ఎర్రని సూర్యుని సాక్షిగా నా జతగా నీవుంటే….
ఆరు ఋతువులేకమైన ఆమని మనదే సుమా

– సాయిప్రియ బట్టు

Related Posts