ఆకలి
నిరుపేద వాడి ఆకలి నిస్సహాయంగా
సహాయం చేసే వాడి వైపు చూస్తోంది..
కాలే కడుపు..కాలి కడుపు కన్నీళ్లతో
ఆకలిని తీర్చే వాడి కోసం కల కంటుంది..
రాజ్యాన్ని ఏలే వాడికి
పంక్ష బక్ష్యపరమన్నాలు…
అదే పేదోడికి ఆకలితో డొక్కలెండిన కడుపులు..
కడుపు నిండిన వాడు తినలేక పడేసే
మెతుకులే కొందరి అభాగ్యుల
ఆకలి తీర్చే ఆధారాలు ఈ భారతంలో..
ఎన్నడు మారునో
ఎప్పుడు తీరునో
ఈ ఆకలి కష్టాలు..
-ప్రవీణ్