అక్షర విలాప నగారా

అక్షర విలాప నగారా

ఘట్టమనేని వంశాంకురా..
అలనాడు అల్లూరి గా అలరించిన వీరా..
80 ఏళ్ళైనా తరగని అందాల రాకుమారా..
ఒకే సంవత్సరంలో 19 సినిమాలు చేసిన నటశేఖరా..
సున్నిత మనసు కలిగిన ధీరా..
ఆలకించండి నా అక్షర విలాప నగారా…

సినీ జగత్తులో మీరో ధృవతార..
మీదో నవశకం.
మీరు ఎదిగిన తీరు అద్భుతం..
మీరు గడించిన జీవితం ఆచరణీయం..
మీరు చూపిన మార్గం అనుసరణీయం..
మీ నటనా కౌశల్యం ఆనందనీయం..
నటన కై మీ సేవ అభినందనీయం..

నటనలో రమణీయుడవు.
విలక్షణ పాత్రల ధారుడవు..
అలనాటి యువతుల మది రాకుమారుడవు.
ఆజన్మాంత వివాద రహితుడవు.
సినీ నిర్మాణ కార్మికుడు.
మచ్చలేని మహనీయుడవు..
గౌరవ పద్మభూషణ బిరుదాంకితుడవు..

ఇలా పలు విధముల మమ్ములను మురిపించి, మైమరపించి, అలరించి దూరమైన సూపర్ స్టార్ కృష్ణుడవు

– కిరీటి పుత్ర రామకూరి 

Related Posts