అలా “మెల్ల” గా

అలా “మెల్ల” గా

నేను చైతన్య భారతి కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో కాలేజీలో అందమైన అమ్మాయిలు చాలా మంది ఉండేవాళ్లు వాళ్ళలో ఒక అమ్మాయి చాలా అందంగా ఉండేది అంటే మిగతా వాళ్ళు అందమైన వాళ్ళు కాదని కాదు,ఆ అమ్మాయి మాత్రం ఇంకా అందంగా ఉండేది ఆమె అందం పన్ను మీద పన్ను ఉండడం వల్లనో లేదా జుట్టు ముందుకు కట్ చేసుకోవడం వల్లనో ఇంకా అందంగా కనిపించేది.

అలా “మెల్ల” గా ఆమె ప్రతి రోజూ నేను రావడం చూస్తూ ఉండేది నేను కాస్త అందంగానే ఉండేవాడిని ఆఆమ్మయి బ్లాక్ బోర్డు దగ్గర కూర్చుని నేను క్లాస్ లోకి రావడం చూస్తూ ఉండేది, ఎప్పుడూ నేనే కాలేజీకి ముందుగా వస్తాను అనుకుంటే ఆ అమ్మాయి మాత్రం ఇంకా ముందుగానే వచ్చేది.

అలా మెల్ల గా
అలా మెల్ల గా

మా పల్లె నుండి కాలేజీ కి రావాలంటే బస్ లోనే రావాలి నేను ఏడు గంటల బస్ కు వెళ్ళేవాడిని నాతో పాటు మధ్యలో ఉన్న ఊర్లలోని  అబ్బాయిలు కూడా అదే కాలేజీకి వచ్చేవాళ్ళు.
అలా “మెల్ల” గా అందరం కాలేజీకి వెళ్ళినా మిగతా వారు కింద ఆగిపోయి మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు , నేను మాత్రం పైన ఉన్న గది లోకి వెళ్ళేవాడిని నేను అక్కడికి వెళ్ళాక ముందే ఆమె ఆల్రెడీ వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది..

నిజానికి నాకు చాలా సంతోషంగా అనిపించేది ఒక అమ్మాయి నన్ను చూసి ఇష్టపడడం నా కోసం ఎదురు చూడడం అంటే ఏ అబ్బాయికి మాత్రం గర్వంగా ఉండదు కదా , నేను అందరికంటే ప్రత్యేకం అని క్లాస్ లో గొప్పగా ఫీల్ అయ్యేవాడిని .

కానీ ఒక్క విషయం మాత్రం నాకు అర్దం అయ్యేది కాదు ప్రొద్దున్న అంతగా చూస్తున్న అమ్మాయి మిగతా సమయాల్లో నన్ను చూడను కూడా చూసేది కాదు.

  అలా “మెల్ల” గా

అదే ఎందుకో నాకు అర్దం అయ్యేది కాదు పైగా అందరితో చాలా బాగా మాట్లాడేది నాతో తప్ప , పోనీలే నాతో మాట్లాడడానికి సిగ్గు పడుతుందట అని అనుకుంటూ ఉండేవాడిని .

ఆమెను చూడగానే నేను సిగ్గు పడుతూ మెలికలు తిరుగుతూ ఉండే వాడిని అలా మా ప్రేమ చూపుల తోనే సాగింది, మొదటి సంవత్సరం అయిపోయి పరీక్షలు రాయడం మొదలు పెట్టాము ఆమె హల్ టికెట్ ప్రకారం ఒకే గదిలో పడ్డాము అంటే ఇద్దరిది ఒకే గదిలో పరీక్షలు రాయడం జరుగుతుంది.

అలా మెల్ల గా
అలా మెల్ల గా

రెండు పరీక్షలు అయ్యాక నాకు తనతో మాట్లాడాలి అని అనిపించింది ఎందుకంటే ఎన్ని రోజులు అని అలా “మెల్ల” గా ఇలా చూపులతో చూసుకుంటూ ఉండాలి ఎప్పుడో ఒకసారి మాట్లాడితే ముందుకు వెళ్ళొచ్చు కదా అనేది నా ఉద్దేశ్యం అందుకే ఇక దైర్యం చేసి తనతో మాట్లాడాలి అని పరీక్ష ప్రాంగణానికి ముందే వెళ్ళాను అప్పుడు కూడా ఆ అమ్మాయి నన్నే చూస్తూ ఉంది.

నేను ఇక ఆపుకోలేక ఆమె దగ్గరగా వెళ్ళి నమస్తే అండి అన్నాను ఆమె నమస్తే ఎవరు మీరు అని అడిగింది !  దానికి నేను ఆశ్చర్యపోయి నేను మీ క్లాస్మేట్ నన్ను రోజు చూస్తున్నారు కదా నేను మీకు తెలియదా అన్నాను ఆశ్చర్యంగా చూస్తూ.

ఏంటి నేను మిమల్ని చూస్తున్నానా  మీరు నా క్లాస్ మేట్ ఆ ?   హా మిమ్మల్ని నేను చూడడం ఏమిటీ అసలు నా గురించి ఏం అనుకుంటున్నారు అంటూ తాను ఎప్పుడూ పెట్టుకునే నల్ల కళ్ళ జోడు తీసింది దాంతో నేను ఆశ్చర్య పోయాను , ఎందుకంటే ఆమె కన్ను మెల్ల కన్ను ..

ఆమె నా వైపు కాకుండా వేరే వైపు చూస్తూ నేను మీ వైపు చూడడం ఏమిటండీ నాకు మెల్ల కన్ను ఉండడం వల్ల మీరు పొరపాటు పడ్డారు నేను ఇదిగో ఇతన్ని చూస్తున్నా అంటూ నా వెనకే ఉన్న వెంకట్ దగ్గరికి వెళ్ళింది

అతను నన్ను చూస్తూ అవును బాస్ తను నా లవర్ మేము స్కూల్ నుండి లవ్ చేసుకుంటున్నాం అని చెప్పడం తో ఇన్ని రోజులూ నేను ప్రేమ చూపులు అనుకున్నది అంతా ఉత్తా మెల్ల చూపులేనా అనుకుంటూ ఉసూరుమంటూ వాళ్లకు సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను బాధతో ..

Posted By Aksharalipi

 

Related Posts