అలలు…

అలలు…

అలలు కలలై మిగిలే జీవితంలో
కలలు అలలై పొంగే జీవితంలో

ఎగసే ఆలోచనల తీరం
సాగేను మనసున ఉప్పొంగే కెరటం

జీవితంలో ఎదురయ్యే అలల దాటికీ కొన్ని జీవితాలు నిలబడితే మరికొన్ని జీవితాలు అలలలో కొట్టుకుపోయే

అలల తాకిడికి వేయాలి అడ్డుకట్ట
లేదంటే ఆ అలల ప్రవాహంలో కొట్టుకుపోవడమే ఉంటుంది

కొన్ని ఊహల అలలు నిన్ను భ్రమింపజేస్తే
మరికొన్ని ఊహల అలలు నీకు వాస్తవాన్ని చూపిస్తాయి

అలలు కలలుగా మిగలకుండా
కలలు అలలుగా సాగాలి
నిన్ను నిలబెట్టాలి
నువ్వు జీవితంలో ఎదురయ్యే అలల తాకిడిని తట్టుకొని నిలబడాలి…

– గోగుల నారాయణ

Related Posts