అలికిడి

అలికిడి

తలుచుకోవటానికి
నాలుగు ముచ్చట్లు చెప్పుకోవటానికి
బంధుబలగమో
మిత్రసైన్యమో ఉండి తీరాల్సిందే
దూర తీరాలు దగ్గరవ్వాలంటే
ఆత్మీయతల నౌకా ప్రయాణం చేయాల్సిందే

గడిచిపోయిన కాలం తిరిగి రానట్టే
రాబోయేకాలం తెలియనట్టే
వర్తమానం నిన్న రేపుల
వార్తాహరురాలై ముచ్చట్లు చెపుతుంటుంది
భ్రమరంలా ఆ తేనెను గ్రోలుదాం
మనుషుల అలికిడి నింపుకుందాం

– సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *