అల్లరులు

అల్లరులు

ఉదయం లేస్తూనే మొదలుపెట్టారా? అబ్బబ్బా నావల్ల కావట్లేదు మీతో అంటూ వంటింట్లోంచి అరుస్తుంది సుధ.

ఏమైందిపుడు ఎపుడు చూసినా పిల్లీ ఎలుకల్లా ఎందుకురా అలా ఉంటారంటూ బాల్కనీలో పేపర్ చదువుతున్న సాకేత్ లేచి‌ వెళ్ళాడు. చూడండి‌ నాన్న నాకు ఇవాళ కాలేజ్ లేదని పడుకుని ఉంటే మీద నీరు పోసాడు అంటూ తన వాదన వినిపించింది కూతురు దీపిక.

అదేం కాదు డాడీ పొరపాటుగా పడ్డాయి దానికే ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటూ సంజాయిషి ఇచ్చాడు హరి. అయినా పదవుతుంటే లేవకుండా వాడిమీద చాడీలు చెప్తున్నావా ఆడపిల్లవని తెలుస్తుందా నీకసలు అంటూ కొడుకు పక్కన చేరింది తల్లి సుధ.

వచ్చేసావా… వాడిని ఏమైనా అనడం పాపం ప్రత్యక్షమైపోతావు అంటూ దీపిక వాళ్ళ డాడీని చూసి నవ్వింది. అంతే అంతే నిజం చెప్పావురా దీపు అంటూ వంతపాడాడు తండ్రి సాకేత్. హా… అవునవును ఇపుడు మీరు మాత్రం మీ కూతురు పక్షం చేరలేదు మరి అంటూ వచ్చి టిఫిన్ చేయండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళింది‌ సుధ.

బ్రష్ చేసుకుని వచ్చెయ్ రా తల్లి టిఫిన్ తిందాం అంటూ సాకేత్ కూడా వచ్చేసాడు. అంతలో మరో ప్రళయం… దీపికని వాష్ రూంలో ఉంచి గడియ వేసి వచ్చేసి ఏమీ తెలీనట్లు టిఫిన్ తింటున్నాడు హరి. దీపిక అరుస్తుంది‌ రే చచ్చావురా ఇవాళ నా చేతుల్లో ఐపోయావ్. చెప్తా ఉండు నీపని డాడీతో అంటూ..

సుధ వెళ్ళి తలుపుతీసి చాల్లే ఆడపిల్ల అణకువగా ఉండాలి‌ మగపిల్లాడితో నీకేంటి అంటూంటే చూడండి నాన్న అన్నీ వాడే చేస్తే అమ్మ‌ నన్ను తిడుతుంది అంటూ సాకేత్ పక్కన చేరింది. అంతలో టిఫిన్ తినడం ముగించుకుని‌ కాలేజ్ కి‌బయలుదేరాడు హరి. వెళ్ళు వెళ్ళు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఇల్లంతా.. డిస్టబెన్స్ ఏం లేకుండా నేను హాయిగా ఉండొచ్చు అంటుంది.

సాకేత్ డార్లింగ్ ఆపరా ఇక.. వాడు వెళుతున్నాడుగా మరల గొడవెందుకు అంటూ ఆపుతాడు. హరి కాలేజ్ కి వెళుతుండగా అనుకోకుండా ప్రమాదం జరిగుతుంది. హాస్పటల్ నుండి కల్ రాగానే అంతా హడావుడిగా పరిగెత్తుకువెళతారు అందరూ.

రెండు కాళ్ళు ప్రమాదంలో పోయాయని ఇకమీదట నడవలేడని ఆపరేషన్ చేయాలని చెబుతారు డాక్టర్. ఆపరేషన్ జరిగుతుంది. ఇంతకుముందులా ఏదీ లేదు అంతా ఓ క్షణంలో మారిపోయింది. ఇపుడు నిజంగానే ఆ ఇల్లు ప్రశాంతంగానే అయిపోయింది.

హరి దీపికల‌ మధ్య ఇంతకుముందున్న చిలిపి అల్లరులు లేవు. ఆ తల్లిదండ్రులకి నవ్వులు లేవు. ఎంత అల్లరి చేసినా వారి అల్లరిలోనని చిలిపి పనుల్లో సంతోషిస్తుండేవారు ఆ తల్లిదండ్రులు. కానీ ఎదిగొచ్చిన కొడుకు ఇలా మంచానికే పరిమితమయ్యే సరికి నిజంగానే ఆ ఇండికి గ్రహణం పట్టింది.

అన్నాచెల్లెళ్ళ మధ్య ఎన్ని‌ చిలిపి అల్లరులు ఉన్నా అవన్నీ చూడ్డానికి సంతోషాన్ని ఇస్తాయి మరెన్నో మధురస్మృతుల్ని మిగులుస్తాయి. ఆ దంపతులకి‌ ఇపుడు ఆ స్మృతులే మిగిలాయి. అల్లరులన్నీ అటకెక్కి పోయాయి. ఎంతైనా కుటుంబాలలోని బంధాల మధ్య ఈ చిలిపితనాలు చాలా అవసరం. బంధం బలపడేది వాటితోనే…

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress