ఆలోచనల అలజడి

ఆలోచనల అలజడి

ఆలోచనల అలజడి

అలలు అలజడి చేసే

కడలి గర్భం నుండి ఉబికి

నీ ఆలోచనలు సందడి చేసే

నా హృదయాంత రాళం నుండి వెడలి

నెమలి పింఛము తోచె

నీ రూపము నే చూడ

కుంచె తీసి రాసితి నీరూపమును నేను

మదిలోన నిను తలపులతో చూడ

నీ రూపమే నా ఆలోచనలాయే

నా హృదయానికి ప్రతి రూపంగా

ప్రతి రూపం నీదే అనిపించి

అలజడి చేసే కడలి అలలవలే

– రమణ మూర్తి

Related Posts