అంబరమంటిన సంబరం

అంబరమంటిన సంబరం

ఎర్రకోటపై త్రివర్ణ పతాక రెపరెపలు
కార్యాలయాలలో జెండావందన సంరంభం
విద్యలయాలలో జెండ పండుగ సంబరాలు

డెబ్భై ఐదు వసంతాల భారతావనిలో
ఎందరో త్యాగధనులు అసువులిడగా
మరెందరో నాయకులు పాటుపడగా
పీల్చుతున్న స్వేచ్ఛా వాయువులకి
ఆనాటి ఘనులందరనూ స్మరించుకుంటూ

భావితరాలకి దిక్సూచిగా
రాబోవు తరాలకి భారతీయత నేర్పుతూ
కర్తవ్యమార్గాలను భోదించిన ఉపన్యాసాలతో
అంబరానంటిన సంబరమీనాటి స్వాతంత్ర్య దినోత్సవం

ఆజాదీకా అమృత మహోత్సవంగా
ఇంటింటా వాడవాడా జెండా రెపరెపలు
స్వేచ్ఛా విహంగంలా అలరారుతుంటే
మదిలోని దేశభక్తిని చాటుకున్న తరుణం
చేయెత్తి జైకొట్టి‌ భారతమాతకు మ్రొక్కిన సుదినం
అమృతోత్సవ సంరంభపు సంబరం.

– ఉమామహేశ్వరి యాళ్ళ

Related Posts