అమ్మబంధం
అమ్మంటే కనిపించే ఆ దైవం
అమ్మంటే కనిపించే దాతృత్వం అమ్మా
తొలి గురువు అమ్మ స్వరనాదం అమ్మ
కలతలు లేని కంచుకోట అమ్మ
కరుణ చూపు కామితం అమ్మ
మమతల మల్లెలు అమ్మ తీయని మకరందం అమ్మ
జన్మ జన్మల అనుబంధం అమ్మ
అనుభూతుల అనురాగం అమ్మ
కమ్మని మమతల కోవెల అమ్మ
గుప్పెడు ఆశల చప్పుడు అమ్మ
కలబోసిన కనకధారా అమ్మ
నిను మెచ్చే వరమిచ్చే ఆ దైవం
అమ్మ
రంగుల హరివిల్లు అమ్మ
కమ్మని రుచుల కారుణ్యం అమ్మ
నవరసాల నవనీతం అమ్మ
మనసున్న మాణిక్యం అమ్మ
వెల లేని దీవెన అమ్మ
కొనలేని గ్రంథం అమ్మ
విరిసిన పువ్వు తోట
చిరు ఆశ ల సుమ మాల అమ్మ
మంచిని చూపే మార్గదర్శిఅమ్మ
వెలుగునిచ్చే జ్ఞానదాత అమ్మ
నవచైతన్యమూర్తి అమ్మ
కదలాడే దేవత అమ్మ
అమ్మంటే కనిపించే ఆ దైవం
అమ్మంటే కనిపించే దాతృత్వం అమ్మా…….
– జి జయ
అమ్మ గురించి చాల గొప్పగా వ్రాసారు.