అమ్మ మనసు
అమ్మ మనసు అందరికీ ఉంటే
భూతలంపై యుద్ధం జరగదు.
ఆకలి కేకలు ఏమీ వినపడవు.
పృథ్వి ప్రేమతో నిండిపోతుంది.
కష్టాలు లేని ప్రపంచం వస్తుంది.
కన్నీళ్లు అనేవి అసలే ఉండవు.
ప్రపంచం అభివృద్ధి చెందేను.
పేదరికం లేని రాజ్యం వచ్చేను.
మహిళలే నాయకులైతే ఈ
ప్రపంచమే మారిపోయేను.
-వెంకట భానుప్రసాద్ చలసాని