అమ్మ పాట

అమ్మ పాట

పల్లవి
అమ్మే దైవమని నమ్మితివా
కలగవింక ఆపదలు ఎన్నడూ
అమ్మే సర్వమని తెలిసినచో
బంధాలకు అర్థము తెలియునుగా

చరణం
నీవే లోకమనుచు బతుకునుగా
నీ సుఖమే తనసుఖమని తలచునుగా
నీ తప్పటడుగే తనకు ముద్దుగా
నీ బోసినవ్వే తనకు వెన్నెల

చరణం
అమ్మంటే త్యాగమని తెలిసినచో
జీవితానికర్థమూ తెలియునుగా
తన ఆకలినే దాచుకొనునుగా
నీ ఆకలికే తల్లడిల్లుగా

చరణం
విజయపథమునే నీవు నడిచితే
మురిసిపోవునది అమ్మ ఒక్కటే
అమ్మ బాటను విడువవద్దురా
అమ్మ మాటను మరువవద్దురా

చరణం
స్వచ్చమైనది నిత్యమైనది
అఖిలజగమున అమ్మ ప్రేమరా
బతుకు లోగిలిలో నీకు అండరా
తనకు ఎప్పుడూ గొడుగు పట్టరా

– సి.యస్.రాంబాబు

Related Posts