అమ్మకి వందనం
అమ్మ గర్భగుడిలో నవమాసాలు పూజ చేసి పొందాను ఈ రూపంఈ భూవిపై కన్నులు తెరిచి తొలినే చూశాను దేవత రూపం.
అమ్మ అనే పదంలో అమృతం ఉంది. అమ్మ చేతి స్పర్శలో స్వర్గం ఉంది. అమ్మ ప్రేమ అనురాగాల ఒడి ఆదేవుడికైనా సేద తీర్చే చల్లని గుడి.
అమ్మ అనే మాట మనం పలికే తొలిమాటఅమ్మ.
అమ్మ పాడిన జోల పాట మనం వినే తొలి పాట.
ప్రతి గృహం దేవాలయం అయితే అందులో కనిపించే దైవం అమ్మ .ప్రతి మనిషి పూజించే తల్లి దైవం అమ్మ.
పూరిగుడిసెలోని అమ్మయినా అద్దాల మెడలోన అమ్మయినా తన బిడ్డపై చూపి ప్రేమానురాగాలు ఒకే లాగా ఉంటాయి.
బాహ్యంగా అలంకరణలో ఆస్తులలో అంతస్తులలోతేడా కనపడవచ్చునేమోగాని ,ప్రతి అమ్మ తన బిడ్డపై చూపి ప్రేమలో తేడా ఉండదు.
అమ్మ చూపే ప్రేమను ఆస్తుల అంతస్థలంతో తీర్చేది తూచేది కాదు చేసేది కాదు. అమ్మను మించినది అమ్మ కన్నా గొప్పనిది. ఈ ప్రపంచంలో లేని లేదు.
ఆకలి నాదైతే,
ఆమె అన్నమైంది..
దెబ్బ నాకైతే,
ఆమె కన్నీరైంది..
నాకు రక్తమోడితే,
చినిగిన కొంగు అయ్యింది..
నే దెబ్బలాడొస్తే,
పొరుగుతో తగువులాడింది..
జీవితం నాదైతే,
బొడ్డు పేగు తెంచి తలరాత రాసింది..
నా కోసం గాయమైంది,
గేయమైంది,
నాకు దేహమైంది,
నా దేశమైంది..
అవేశమైంది,
ఆదేశమైంది,
అనురాగమైంది..
బొమ్మ అయింది,,
నాకు అమ్మ అయింది..
#అమ్మ ఒక వేదం…
అమ్మ ఒక భక్తిభావం…
అమ్మ ఒక ప్రేమరూపం..
అమ్మ ఒక సంవేదన…
అమ్మ ఒక భావన…
అమ్మ ఒక పుస్తకం…
అమ్మ ఒక కలం…
అమ్మ ఒక కవిత…
అమ్మ ఒక జ్ఞానం…
అమ్మ ఒక గుడిలో దీపం…
అమ్మ ఒక హారతి పళ్లెం…
అమ్మ ఒక సుకుసుమం…
అమ్మ ఒక చల్లని చిరుగాలి…
అమ్మ ఒక అన్నపూర్ణ…
అమ్మ ఒక లాలిత్యం…
అమ్మ ఒక చీరకొంగు…
అమ్మ ఒక కరుణ…
అమ్మ ఒక దీవెన…
అమ్మ ఒక అక్షిత….
అమ్మ ఒక వర్షపు బిందువు…
అమ్మ ఒక మధురగేయం…
అమ్మ ఒక శ్వాస…
అమ్మ ఒక వూపిరి…
అమ్మ ఒక మురళి గానం…
అమ్మ ఒక జోలపాట…
అమ్మ ఒక పచ్చదనం…
అమ్మ ఒక కనురెప్ప…
అమ్మ ఒక దేవత…
అమ్మ ఒక పుడమి…
అమ్మ ఒక స్వచ్ఛత…
అమ్మ ఒక ప్రవచనం…
అమ్మ ఒక వెలుగు…
అమ్మ ఒక సుగుణం…
అమ్మ ఒక నమ్మకం…
అమ్మ ఒక ఆరోగ్యం…
అమ్మ ఒక భద్రత…
అమ్మ ఎన్నో ఎన్నెన్నో…….
ఎన్ని రాసినా సరే ఇంకా ఏదో మిగిలే ఉండే అనంతపు అక్షరమైంది…..🖋️
(ప్రతి తల్లికి ఈ రచన అంకితo
-గురువర్ధన్ రెడ్డి