అమ్మంటే
అమ్మంటే అమృతం..
అమ్మంటే అధ్బుతం..
అమ్మంటే అమెాఘం..
అమ్మంటే అపురూపం..
ఈ నాలుగు లైన్లు ఎప్పుడూ రాసుకుంటాను నేను..
అమ్మ ప్రేమకు సాటి రాదు ఏ ప్రేమ..
అమ్మ ఉంటే ఈ లోకంలో అన్నీ ఉన్నట్టే!!
ఒకప్పుడు అమ్మ లేని జీవితాన్ని ఊహించుకోలేదు నేను..
అమ్మ లేకుంటే బ్రతకడమెలా? అనుకునేదాన్ని..
కానీ మా అమ్మ ఉన్నప్పుడే నేను కూడా అమ్మనయ్యా!
నేను లేకపోతే నా పిల్లలకు అమ్మ ఎలా ? అనే ఆలోచన
వచ్చింది అమ్మ పోయాక..
అంతే బ్రతకక తప్పలేదు..
నిజంగా అమ్మ పోస్ట్ నిర్వహించడం చాలా కష్టం మా అమ్మ ఎలా ఆ పోస్టును ఎంత కష్టంగా అనుభవించిందో
తలుచుకుంటేనే చాలా బాధగా ఉంటుంది…
అప్పుడేమెా సంతానమెక్కువ..
మా అమ్మైతే సంతాన లక్ష్మే! అంతమందిని ఎలా పెంచి పోషించిందో?
మా అమ్మంటే నాకు చాలా ఇష్టం..
అమ్మ లేకపోతే నా గుండె ఆగిపోతుందనుకున్నా! కానీ
ఆగలేదు..
నా పిల్లల కోసమేమెా!
అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేనిది అది మనం అందరం అనుభవించేదే! కొంతమంది అనుభవిస్తున్నదే! ఆ అధృష్టం అందరికీ ఉండదు..
అందరికీ ఉంటే అంతకన్న కావలసిందేముంది..
– ఉమాదేవి ఎర్రం