అమ్మే నా లోకం!

అమ్మే నా లోకం!

అమ్మే నా లోకం!

 

అమ్మంటే అమృతం..
అమ్మంటే అధ్బుతం…
అమ్మ లేనిదే రాలేదు..
మనకీ జీవితం..

అమ్మ గురించి ఎప్పుడూ నేను రాసుకునేది ఈ మినీ
కవిత..
మా అమ్మంటే నాకు పంచ ప్రాణం..మా అమ్మకు నేను పదకొండో నంబరును కానీ అమ్మకునేనంటె పంచప్రాణం.మా నాన్నకు కూడా అంతే!ఎందుకంటె..మా అమ్మకు అయిదుగురు పుట్టాక మా చిన్న అన్నయ్య తరువాత మళ్లీ అయిదుగురు పుట్టి చనిపోయారట..తరువాత నేను పుట్టాను..అయితే ఎన్ను చల్లనోడు కాకపోతె వెనుక పుట్టిన అందరూ చనిపోతారని ఎవరో చెప్పారట దాంతో మాపెద్దక్క మా చిన్నన్నయ్య వెన్నులో గారెల పుల్ల బాగాకాల్చి వాత పెట్టిందట దానికి మా చిన్నక్క కూడా సహాయం చేసిందట..చెప్పాను కదా! నాకన్నా మా అక్కలు అన్నలు చాలాపెద్దవాళ్లు అందుకే అలా మా అక్కలు వాత పెట్టారు..మా అమ్మకు కూడా తెలియదట తెలిసాక మా అక్కలపెళ్లి చేసిందట..

అయితే నేను పుట్టింది దీపావళి అమావాస్యకట మానాన్న పంతులు గారన్నమాట పంచాంగాలు చూసే వారు..మా వీధిలో అందరికీ కూడా!నాతో లర్ష్మీదేవి వచ్చిందని మా నాన్న నమ్మకం అందుకేనాకు పెళ్లి చేసి పంపాలని అనుకోలేదు మా నాన్న ఇల్లరికం ఉంచుకోవాలనుకున్నారు కానీ నేను పదోతరగతిలో ఉన్నప్పుడే శివైక్యం చెందారు..అందుకే మా అమ్మ పెళ్లి చేసింది..

మా నాన్నుంటే ఇల్లరికం ఉండే అల్లున్నే తెచ్చేవారు..మా అత్తారింటికి పంపించింది కానీ తరువాత మా ఇళ్లు తాళం పడిపోయింది..మా నాన్న చెప్పింది అక్షరాల జరిగింది అని అందరూఅన్నారు..ఇక మా అమ్మయితే నన్ను కంటికి రెప్పలా చూసుకుందిఇద్దరు పిల్లలు పుట్టాక కూడా నాకు అన్నం తినిపించేదినేను కాలేజ్ లో ఉన్నప్పుడయితే కొంచం లేటయితే చాలు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా కాలేజ్ కు
వచ్చేది..

అసలు అమ్మ ప్రేమను ఎలా కొలవగలం?మా అమ్మతో నా అనుబంధం చాలా విలువయిందిచాలా చాలా అధ్బుత మయింది..నా చిన్నమ్మాయి సంవత్సరం నర ఉన్నప్పుడు మా అమ్మ కూడా శివైక్యం చెందారు..అమ్మంటె నా ప్రాణం నా దైవం నా లోకం మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే!!అమ్మా! నువ్వు లేని జీవితాన్ని ఎప్పుడూ ఊహించు కోలేదమ్మా!!అమ్మ గురించి చెప్తుంటె ఇప్పుడు కూడా కళ్లల్లో నీళ్లు తిరుగుతూనె ఉన్నాయి..
ఇక రాయలేక పోతున్నా!

 

 

-ఉమాదేవి ఎర్రం

 

అమ్మ ఒడి Previous post అమ్మ ఒడి
మా తల్లి అంబికా కరుణించవే Next post మా తల్లి అంబికా కరుణించవే

One thought on “అమ్మే నా లోకం!

  1. అమ్మ గొప్పతనం గురించి గొప్పగా వ్రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *