అనగనగా ఆ రోజు
నేను బిచ్చగత్తె నా?
నిజమే నేమెూ……
నా లాంటి వారు ఎందరో?
ఉద్యోగం లేక, కూలీ పని చేయలేక, డబ్బు లేక…..
ప్రతి రూపాయి కి ఆయనను
కొడుకులను, అడుక్కుంటూ
నేనొక బిచ్చగత్తె ను అయ్యాను
ప్రతి తండ్రీ డబ్బు లేక పోతే
పని చేత కాక పోతే బిచ్చగాడు
అయి పోవలసిందే కదూ…..
ఉద్యోగస్తులు జీతం కోసం
ఆశగా ఎదురు చూసే బిచ్చగాళ్ళే సుమా…..
మీ అందరి ముందు నేనెంత?
– చిరంజీవి (లీల)