ఆనందాల హరివిల్లు

ఆనందాల హరివిల్లు

గృహమే కదా స్వర్గసీమ!
అదే ఆనందాల హరివిల్లు
పూల పొదరిల్లు
ఆత్మీయ బంధాలు,
అంతులేని జ్ఞాపకాలు,
అందరి సహకారం,
అమ్మ వొడిలో మమకారం,
నాన్న బాధ్యతల బరువులు
కుటుంబం తోడుగా నీడగా
ఎన్నెన్నో మధుర స్మృతులు
ఇంటిలోని ప్రతి చోటు
ప్రతి మూల, ముంగిలి
స్పర్శ తో పెనవేసిన ముడి
భారమైన రోజులైనా
అందాల అలికిడితో నైనా
మురిసిముగ్దులమవుతాయి
ఇంటికి చేరగానే!

అలసటను తీర్చి ఆదమరచి
నిశ్చింతగా నిదురించే చోటు

మన ఇల్లు హరివిల్లు మాత్రమే

కుటుంబంతో కూర్చున్నా
పండుగల శోభలు కూర్చినా
పెళ్లి పేరంటాల శుభాలతో
కళ కళలాడేది మన ఇల్లే

పచ్చని మొక్కలతో చక్కని
ఆరోగ్యంతో అన్ని వేళలా
అంతులేని అనుభూతుల తో

నిండి ఉండేది మన ఇల్లే

పలకరించే పరిసరాలు
మక్కువ పెంచుకున్నఆస్తిగా
దక్కిన గౌరవాలు
దాచుకున్న అనుభవాలు
అలరించిన హరివిల్లే ఇల్లు

నాలుగు రోజులు ఇల్లు వదిలి
వుంటే విలువ ఎంతో తెలుస్తుంది 5స్టార్ హోటల్లో
బస చేసినా మనసు పరుగు
మాత్రం మన ఇంటికే

పూరి గుడిసె కాని రాజ భవంతులైనా,

పసిడి తాపిన గోడలైనా, అంతు లేని అనుబంధాల వీచిక
ఆనందాల హరివిల్లు అదే
అందరి జ్ఞాపకాల పుట్టిల్లు
మనిషి జీవితంలో ఇల్లే కదా
అనుబంధాల వేదిక …..!

– జి జయ

Related Posts