ఆనందోబ్రహ్మ
భద్రగిరి అనే గ్రామంలో రామయ్య చాలా చదువుకున్నవాడు.కానీ అతను వద్ద డబ్బులు లేవు. ఎన్ని ప్రయత్నాలు చేసిన మంచి ఉద్యోగం రాలేదు.
చివరికి అతడు ఏం చేయాలో తెలియక ఊరు వాడ వదిలి పట్నం వెళ్లిపోయాడు. కానీ అక్కడ అంతా అతనికి అఘమ్యాగోచరంగా ఉంది.
బ్రతకడానికి వేరే దారి లేక రోడ్డుమీద, శవం మీద వేసిన డబ్బులు ఏరుకుని అతడు ఒక్కడే కలిసి ఇంట్లో వాళ్లకిచెప్పకుండా బయలుదేరి ఆ అందిన డబ్బులతో పాల ప్యాకెట్లు కొని రోడ్డుమీద అమ్మసాగాడు వాటికి మంచి వేల వచ్చింది .
అక్కడ నుండి ఒక 28 రూపాయలు 28 రూపాయలది 35 రూపాయలకు అమ్మడం ప్రారంభించాడు. ట్రైన్ లో బస్సులో ఉన్నవారు అధిక ధర అని చూడకుండా కాలక్షేపాన్ని కొనుక్కున్నారు.
ఇది అతనికి జీవనానికి గురి అయినది. అతడు ఇలా రోజు ఎక్కువగా అమ్ముతూ ఒక్కసారే షాపు పెట్టుకునే అధిక లాభం సాధించగలిగాడు , అయితే తనకు ఒక నమ్మకం.
మన వద్ద ఏమీ లేకున్నా ఏదో ఒకటి సాధించగలం. అని గొప్ప నమ్మకం ఉంది దాంతో అతడు నిలబడగలిగాడు. ఈ యొక్క సందేశాన్ని గుర్తుంచుకొని ఆ ఊరికి మరలా తిరిగి వెళ్ళాడు.
అక్కడ పాల డైరీ ఫార్మ్ ఏజెన్సీ పెట్టుకొని భద్రగిరి అంతా సాధించిన సంపాదించిన డబ్బులతో దర్జాగా జరిగింది . ఇది నిజంగా తన కాలు మీద తన నిలబడడం తెలుసుకుని
ఆ ఊరు ఎమ్మార్వో గారు ఇతనికి మెచ్చుకొని ఒక దళిత జనుడు చక్కగా కష్టపడి పైకి వచ్చినందుకు అతనికి కొంత డబ్బులు బహుమతిగా ఇచ్చి గౌరవించడం మరియు అతనికి ఐదు లక్షలు నుండి 15 లక్షలు వరకు లోన్ కూడా ఇచ్చారు.
ఈ విషయం తెలుసుకునే రామయ్య చాలా సంతోషించాడు ఆనందోబ్రహ్మగా నిలబడసాగాడు.
-యడ్ల శ్రీనివాసరావు