అనంతం

అనంతం

అనంతం

 

ఆడపిల్లగా పుట్టి, ఇంట్లో మహలక్ష్మిలా పెరిగి, అందరిచేతా కొన్ని సార్లు తిట్టించుకుని, మరి కొన్నిసార్లు మెప్పించుకుంటూ, చదువుకునే చదువు కోసం పోరాడి, ఇష్టమైన చదువు చదువుకోవాలని ఉన్నా , లేకపోయినా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే వింటూ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ, ఆ పై ఉద్యోగం చేయాలి అని ఉన్నా కూడా తల్లిదండ్రులు చెప్పారని , చూపించారు అని ఎవర్నో ముక్కు మొహం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకునిమరో ఇంటికి కొత్త కోడలిగా అడుగు పెట్టి , కోటి ఆశలతో వెళ్తుంది.

భర్త , అత్తామామలు మంచివాళ్ళు అయితే బాగానే ఉంటుంది సంసారం, అదే అత్తామామలు మంచివాళ్ళు కాకపోతే ఉంటుంది నరకం. అయినా కూడా ఆ నరకాన్ని భరిస్తూ, పుట్టింటి వారికి బాగున్నాను అని కన్నుల్లో నీరు బయట పడకుండా, పెదవుల వెనక దాచేసి, నవ్వుతూ చెప్తుంది.

ఇక తల్లి అవుతున్నా అని తెలిసిన క్షణం నుండి ఆ పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటుంది. ఆ పుట్టబోయే బిడ్డ వాంతులతో విసిగించినా, కాళ్ళతో తన్నినా అందరికి సంతోషంగా చెప్తుంది, నెలలు నిండే కొద్ది ఆయాసం వస్తున్నా, తినబుద్ధి కాకపోయినా , మందులు, గోలీలు ఇష్టం లేకపోయినా మింగుతుంది.

నెలలు నిండే కొద్దీ దొడ్డికి పోవడం కష్టం అయినా, కూర్చోడానికి ఎంత కష్టం అయినా కూడా సంతోషంగా భరిస్తుంది. తొమ్మిది నెలలు నిండిన తర్వాత అపరాత్రో, అర్ధరాత్రో నొప్పులు మొదలవుతాయి. అప్పుడు మొదలైన నొప్పులకు నెత్తిలో నుండి చెమటలు కారుతూ, ప్రాణాలు పోతాయా అనేలా గొంతు చించుకుని అరుస్తూ నరాలన్నీ తెగిపోతాయేమో అన్నంత నరకం కనిపిస్తుంది, పొట్టలో ఉన్న నరాలన్నీ ఒక దగ్గరికి వచ్చేసి , నొప్పులు పెరుగుతూ ఉంటాయి.

ఆ సమయం లో దగ్గరలో ఆసుపత్రి ఉంటె తీసుకు వెళ్తే మంచిదే, లేదా నరకం. అదే నరకo అనేది ఎక్కడో లేదు బాబోయి ఈ నరకం నాకొద్దు అంటూ అమ్మా , అమ్మా , అమ్మా అంటూ అరుస్తూ ఉంటె నర్సులు హేళన మాటలు మాట్లాడుతుంటే సిగ్గుతో చచ్చిపోయి, తల దించుకుని నొప్పిని భరిస్తూ , నోరు మూసుకుని అమ్మా అ,అంటూ ముక్కుతూ , మూలుగుతూ , దొడ్డికి పోయినట్టు ములుగు, ములుగు , ములుగు అంటూ నర్సులు తిడుతూ ఉంటె మూలుగుతూ ఉంటుంది.

ఇక చివరికి ఓపిక లేక చెమటలన్నీ కారిపోయి, సొమ్మసిల్లి పడిపోతుంటే, నర్సులు చెంపల పై కొడుతూ లేపుతూ ఉంటె తెలివి తెచ్చుకుంటూ చివరి ములుగు గట్టిగా మూలిగితే అప్పుడు అప్పుడు తొమ్మిది నెలలుగా తల్లి గర్భం లో విశ్రాంతి తీసుకున్న బిడ్డ బయటకు వస్తుంది, ఆ వెనకే మాయ వస్తుంది, ఆ మాయే ఇన్నాళ్ళు బిడ్డకు రక్షణ కవచం లా ఉంటుంది.

తర్వాత నర్సులు మాయ తీసి బిడ్డకు ఒళ్ళంతా పూస్తారు, దాంతో పాటూ బొడ్డుతాడు కత్తిరించి, తుడిచి, బిడ్డ రన్ని కిలోలు ఉందో లేక్కబెడతారు, తర్వాత బిడ్డను ఐసొ లెటర్ లాంటి వేడి దాంట్లో పెడతారు, ఎందుకంటే ఇన్నాళ్ళు లోపల ఉన్న బిడ్డ ఒక్కసారిగా బయట ప్రపంచానికి వస్తుంది,  బయట వేడిని భరించడానికి అలా పెడతారు.

అప్పటి వరకు బాధను అనుభవించిన తల్లి బిడ్డ పుట్టాక వచ్చే రక్తం తో బట్టలు తడిచిపోతుంటే, వాటిని మారుస్తారు. తల్లి ,లేదా ఎవరో ఒకరు, తల్లి ఇంత సేపు పడిన బాధ మర్చిపోయి బిడ్డను చూడాలి అనుకుంటుంది, కాని బాగా అలసిపోవడం తో మత్తులోకి జారుతుంది.

ఆ తర్వాత బిడ్డను చూసుకుని చాలా సంతోషిస్తుంది, వాడికి తన రక్తాన్ని పాలగా మలిచి ఇస్తుంది, వాడు చేసిన మల ముత్రాలను శుభ్రం చేస్తుంది, పిల్లాడు తినడం లేదంటూ బాధ పడుతుంది, , ఎప్పుడూ లేస్తాడో అని నిద్ర కాచి ,మరి వాడిని కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతుంది. అందుకే అమ్మ ప్రేమ అనంతం .

వాడు పెరిగి పెద్దయ్యాక చూసి,సంతోషిస్తుంది. వాడు చదువులో మొదటగా వస్తే ఆనందిస్తుంది. అందరికి చెప్పుకుంటుంది, తల్లి వాడు అంటే తన బిడ్డ అందంగా లేకపోయినా, చెడు మార్గాలు పట్టినా, లేదా హత్యలు చేసినా తల్లికి బిడ్డ ఎప్పుడూ చిన్నవాడే, ఒక్కసారికే ఇంతటి బాధ అనుభవిస్తే,  నలుగురూ పుడితే ఇంకెంత బాధ అనుభవిస్తుందో ఆలోచించండి.

అలాంటి తల్లిని ఈ రోజు వృద్దుల ఆశ్రమాల్లో చేర్చడం, పని మనిషిలా చూడడం ఎంత వరకు కరెక్ట్ అనేది మీ ఆలోచనకే వదిలేస్తూ ..

అమ్మలందరి కి మాతృ దినత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ….మళ్ళి జన్మంటూ ఉంటే మా అమ్మకే కూతురిగా పుట్టాలని కోరుకుంటూ.. లవ్ యు అమ్మా….

 

-భవ్య చారు

సాగిపో మిత్రమా Previous post సాగిపో మిత్రమా
ఆదర్శనీయురాలు అమ్మ Next post ఆదర్శనీయురాలు అమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close