అందమైన లోకం

అందమైన లోకం

అందమైన పూతోట
అందులో పచ్చని చెట్లు
ఎటు చూసిన పచ్చదనం ఆవరించి ఉంది..
నీలి ఆకాశం తెల్లని మబ్బులతో మెరుస్తూ ఉంది.. స్వచ్ఛమైన గాలి పిలుస్తున్నాను..
ఆ పచ్చని పూతోటలో అక్కడక్కడ రంగురంగుల పువ్వులు ఉన్నాయి..
రంగురంగుల సీతాకోకచిలుకలు తిరుగుతున్నాయి..
పక్షుల కిలకిల రావాలు వింటుంటే
మనసుకి తెలియని ఆనందాన్ని ఆవరించి
అక్కడ నేను ఒంటరిగా ఉన్నాను అనే భయం లేకుండా
ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది…
ఎలాంటి శబ్దాలు లేకుండా
అందమైన ఒక ప్రేమ కథ అయిన పుస్తకాన్ని చదువుతూ
నన్ను నేను మర్చిపోయి పుస్తకంలో ఉన్న పాత్రల్లో మునిగిపోయి
నా ఊహల ప్రపంచంలో విహరిస్తుండగా
నేను నిద్రలోకి జారుకున్నాను…
ఆ నిద్రలో అందమైన కల వచ్చి
నన్ను ఇంకా మురిపించింది…
నా ఊహల సరిహద్దులకు వర్షం అడ్డుపడింది…
ఆ వాన చినుకులకు నాకు మెలకువ వచ్చేసింది…
అందమైన కలతో నన్ను మురిపించి అందమైన లోకానికి తీసుకొని వెళ్ళింది…
ఆ అందమైన లోకాన్ని చూసే లోపే వర్షం పడింది..
ఈ అందమైన లోకాన్ని చూడడానికి నాతోపాటు మీరు వస్తారా?
ఈ అందమైన పూతోటలో నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను…

 

-మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *