అందమైన శత్రువు

అందమైన శత్రువు

నా పరిచయం ఎలా చేసుకోవాలో ఏమి అని చెప్పాలో తెలియటం లేదు. ఎంతమంది లో వున్న ఎంతమందికి తెలిసినా కొందరు స్వార్ధం కోసం ఉపయోగిస్తే చాల తక్కువ మంది నన్ను నన్ను గా నేను ఏంటో తెలుసుకొని ఎదుటి వారికీ అందిస్తున్నారు.

ఈ కాలం లో నిజాయతి గా నన్ను వారిలో ఉంచుకొనే వారు కరువై అందమైన అబద్ధం గా నన్ను చిత్రీకరించి ధన మాన ప్రాణాలను తీస్తున్నారు ఇస్తున్నారు

అసలు నన్ను తమలో ఉంచుకొని స్వలాభం, స్వార్ధం కోసం ఉపయోగిస్తున్న ఏమి చేయలేని నిస్సహాయస్థితి లో వున్నాను. ఎన్నో ఊహలతో భవిష్యత్తు గురించి కలలతో నాలో ఇమిడిపోతున్న ఎందరినో ఈ మానవాళి లో వున్న కుతంత్ర భావాలతో నన్ను పావుగా వాడుకొని నా విలువ తగ్గిస్తున్నారు.

ఎటువంటివారు అయినా ఏదో ఒక సమయం లో నన్ను తలుచుకొని నాకు పెట్టుకొన్న ముద్దు పేరు.. అందమైన శత్రువు

ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కదా.. నా పేరు ప్రేమ… వినటానికి అందం గా అనుభవించటానికి అద్భుతంగా ఫలితం మాత్రం అగమ్యగోచరం చేసే అందమైన శత్రువు ని.

– సూర్యాక్షరాలు
Insta id : suryaksharalu

Related Posts