అందని ద్రాక్ష

అందని ద్రాక్ష

బయటపడి,తన అశక్తత
నొప్పుకోలేక,
ఇతరులపై నేరము మోపు
నైజము కొందరిది

ద్రాక్ష పళ్లకాశపడి
ఎగిరి ఎగిరి అందక
ఈ పళ్ళు పులుపన్న
జిత్తులమారి నక్కలా

లంచాలు మరిగి,కోట్లు
కూడ బెట్టి
అడుగ నెవరైన,నేరం
పైవారిపై, నెట్టి నట్లు

అందని దానికి
ఆశపడకు
అందిన దానితొ
తృప్తి చెందు

అందని వారికి
ద్రాక్ష పులుపు
అందిన వారికదే
తీపిగ నుండు

– రమణ బొమ్మకంటి

Related Posts