అందని ద్రాక్ష

అందని ద్రాక్ష

అందని ద్రాక్ష పుల్లన అని నక్క నీతి అందరికీ తెలిసిందే .
ఎందువలన అంటే ప్రయత్నించినా సాధ్యం కాని పనులు వాటివలన దుఃఖం
కలుగకుండా మనస్సుకు సర్దిచెప్పుకొని మరచిపోవడం
దానితో వచ్చిన ఆవేదన ఆలోచన, మిన్నకుండా ఉండిపోవడం .
ఈ మద్యే ఒకరోజు నేను వెళ్ళే దారిలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది దానికోసం కూలీలు సిమెంట్, రాళ్ళు,
చేరవేస్తూ , మధ్యాహ్నం భోజన వేళ విరామం లో
అందరు కలిసితింటున్నారు
రోజు కష్టపడి పనిచేస్తారు కదా మీ ఫీలింగ్స్ ఏమిటి అనిఅడిగాను.

వారిసమాధానం: మేము బ్రిడ్జి లు కట్టడానికే పనిచేస్తాం అమ్మా.

వాటిమీద నడవడానికి కాదు కదా అన్నారు .
కూలి: మాకు కూడా ఆశలు
వుంటాయి కాని వీటిమీద కార్లలో తిరగాలి అని అవకాశం లేదుకదాఅన్నారు

నిజమే కదా ఆశించడం
తప్పులేదు మానవసహజం
అనుకున్నాను.

కూలి: కాని మా వూరి చెఱువు గట్టు మీద నడిచినప్పుడే

మాకు సంతోషంగా వుంటది అన్నారు. తృప్తికి మారు పేరులా

అందనిద్రాక్ష పుల్లన అని
అతిగా ఆశ పడకుండా
దొరికిన దానిలో సంతృప్తి
పడటం అంటే ఇదే…….?

– జి జయ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress