అందరాని చందమామ

అందరాని చందమామ

అందరాని చందమామే కాని అందాల చందమామే
అందరికివెన్నెలపంచేహాయి
అందాల చందమామ ను
అద్దంలోచూపిగోరుముద్దలు
పెట్టినప్పుడు ఆనందంతో
చూసి ముసిరిపోయాము
చూసే కళ్ళకు తెలుసు
నల్లటి ఆకాశంలో చల్లని చందమామ వెలుగు
నింగిలోకి తొంగిచూసి నిదుర పోయే వేళ కలలకు
తెరతీసి నిన్నుచూస్తే
ఆరాటం వద్దు అందిన దానితో ముద్దు అన్నట్టుగా
నచ్చని నల్లని మచ్చలను
కాకుండా కలువల అసలైన అందాలు చూడాలి
అందితే విలువుండదు
అత్యాశతో కాకుండా
అద్దంలోచిక్కినచందమామ
వేగం పెంచి దాటితే
లోకం పరుగుతీస్తుంది
అందరాని చందమామ
కోసం అందే వరకు
పరుగుల అడుగులు
అది మానవ సహజం మరి………

– జి జయ

Related Posts