అందరికీ అన్నయ్య

అందరికీ అన్నయ్య

అందరికీ అన్నయ్య

నా పేరు స్పందన, నాకు మా అన్నయ్య అంటే చాలా ఇష్టం. మా అన్నకు కూడా అంతే. చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టమైన పండుగ రాఖీ. ఎందుకో తెలుసా, ఆ ఒక్కరోజే మేము ఇద్దరం దెబ్బలాడుకోకుండా ఉండేది.

అన్నను నాన్న దగ్గర ఇరికించి తిట్లు తినేలా చెయ్యడం నాకు చాలా ఇష్టం. వాడు కూడా అంతే. మా అన్నకు మిలిటరీ అంటే చాలా ఇష్టం. మిలిటరీలో ఆఫీసర్ అవ్వాలి అనేది మా అన్న కోరిక. అనుకున్నటే ఆ ఉద్యోగం సాధించే పనిలో ఉన్నాడు. అది 2021, ఆరోజు రాఖీ,అదే రోజు అన్నకు ఫైనల్ పరీక్ష, ఈ పరీక్ష పూర్తి అయితే ఉద్యోగం వచ్చినట్టే. రాఖీ పౌర్ణమి రోజు నాతో రాఖీ కట్టించుకొని పరీక్షకు వెళ్ళాడు.

పరీక్ష చాలా బాగా రాశాను అని చెప్పాడు ఇంటికి వచ్చి. అందరం చాలా సంతోషంగా ఉన్నాం. అన్న చెప్పినట్టే వాడికి ఉద్యోగం వచ్చింది, చాలా సంతోషంగా అనిపించింది. అన్న బోర్డర్ కి వెళ్ళాడు. అక్కడ చాలా దైర్యంగా ఉండేవాడు. నేను లేచి ఉన్నా కాబట్టి నా దేశం అంతా చాలా దైర్యంగా నిద్రపోతుంది అని చెప్పేవాడు.

ఆ మాట చాలా బాగుంది. ఆ మాట మాలో చాలా బలం నింపింది. నిజమే, అలా చాలా మంది అక్కడ ఉన్నారు కాబట్టి, ఇక్కడ దేశం పచ్చగా ఉంది. ఈరోజు రాఖీ,కానీ మా అన్న రాలేదు. కానీ,నాకు బాధగా లేదు. మా అన్న అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టే, ఇక్కడ చాలా మంది రాఖీని జరుపుకుంటున్నారు.

వాడు నాకు ఒక్కడికే అన్నయ్య కాదు, నా లాంటి ఎంతో మందికి అన్నయ్య. వాడు ఒక్కడే కాదు, మనకోసం అక్కడ నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ మనకి అన్నలే. మేరా భారత్ మహాన్… జై జవాన్.

– చైతన్య

అన్నా చెల్లెలి అనురాగం Previous post అన్నా చెల్లెలి అనురాగం
భూదేవి రక్షాబంధన్ Next post భూదేవి రక్షాబంధన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close