అనివార్యం

అనివార్యం

కనికరం లేని కాలం…
కానుకగా ఇచ్చిన…
శిధిల జ్ఞాపకాలు..
నిషీధి లాంటి నా హృదిని..
ముళ్ళ పొదళ్ళా చుట్టుకొని..
ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా..
నిరతం నీ ధ్యాసలో…
నిను చేరే క్షణం కోసం..
అనుక్షణం పరితపిస్తూ…
తెగిన గాలిపటంలా…
అస్థిమితమైన…
మోడు లాంటి జీవితాన్ని..
ముందుకు నడిపిస్తూనే ఉన్నా…
ఎందుకంటే…
అప్రమేయంగా అందిన..
అనివార్యమైన…
ఈ బతుకు నాటకాన్ని….
చివరికంటా…
అభినయించి వెళ్లాలని….

– మామిడాల శైలజ

Related Posts