అన్నా- చెల్లి

అన్నా- చెల్లి

తేటగీతి

కలిసి ఆడుకొనుచు తీపి కలలు కంటు
క్షణము కవ్వించు తక్షణం క్షేమమరచు
కంటిపాపగా చెల్లిని కాచుచుండు
చెదరి పోనట్టి బంధము సోదరులది

తేటగీతి

కళ్ళ గంతలు గట్టించు కేక పెట్టు
పట్టు తప్పక చెల్లిని పట్టుకొనగ
అలసి పోయిన దొరుకును అతనికతడె
అన్న చెల్లెళ్ళ బంధము కంతులేదు

ఆటవెలది

జంట కవులలాగ జట్టుగా వుందురు
అరమరికలులేక ఆడుచుంద్రు
అమ్మ వంట పనుల కాటంక పడకుండ
ఊయలందు వేసి ఊపుచుండు

– కోట

Related Posts