అంతా నువ్వే
పుస్తకము, కలము మరిచిపోయి 20 సంవత్సరాలు గడిచిపోయింది.ఏ రక్తసంబంధం సరిగా తెలియకుండా పెరిగాను.
అనుకోకుండా ఒక విడితిలో కలుసుకొని దగ్గరయ్యాము .మన మధ్య స్నేహం పెరిగింది.
నువ్వేమో? చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అధికారివి. నేనేమో సామాన్య గృహిణినీ మనిద్దరి మధ్యలో వ్యత్యాసం చాలా బాగా ఉంది.
అయినా ఏ స్వార్థం లేకుండా రచనా రంగంలో నీతో సమానంగా ఉండాలని నాచే పుస్తకము పెన్ను పట్టించి రచన రంగంలో అడుగు పెట్టించావు.
నా కలము నుండి జాలువారే ప్రతి ఒక్క అక్షరానికి కారణం
అంతా నువ్వే నువ్వే.
– బేతి మాధవి లత